Headache with COVID-19 symptoms: కరోనావైరస్ సంక్రమణ సాధారణ లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అందులోనూ Coronavirus సోకడంతో వచ్చే headache అసాధారణ స్థాయిలో ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్న లక్షణం. వీరిలో కొంతమంది Migraine headache తో బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. అయినప్పటికీ, తలనొప్పి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు, సైనసిటిస్ లేదా అలెర్జీలతో కూడా వస్తుంది కాబట్టి ఈ తలనొప్పి కొవిడ్-19 వల్ల వచ్చిందా లేక సాధారణమైనదా అని గుర్తించడం గందరగోళంగానే ఉంటుంది. తేలికపాటి తలనొప్పి ఒత్తిడి, అధికంగా కంప్యూటర్, మొబైల్, టీవీ స్క్రీన్ చూడటం వల్ల వస్తుంటుంది. లేదా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వస్తుంది. ఏదేమైనా, తాజా అధ్యయనంలో తేలింది ఏంటంటే.. COVID-19 వల్ల కలిగే తలనొప్పికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. అవి ఏంటంటే...
కరోనా సంక్రమణ తొలి, చివరి దశలలో తలనొప్పి అధికంగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. శరీరంలో వైరల్ రెప్లికేషన్ వల్ల కలిగే మంట నుండి బలహీనపరిచే జ్వరం వచ్చే వరకు COVID-19 తో తలనొప్పి వస్తుంది. ఇది ఎక్కువసేపు కొనసాగితే శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందని అనుమానించాల్సిందే.
టర్కీలోని ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనంలో COVID-19 లేని మొత్తం 3196 మంది రోగులు, COVID-19 పాజిటివ్ ఉన్నట్లు తేలిన మరో 262 మంది రోగులపై సర్వే చేశారు. వీరంతా తలనొప్పితో బాధపడుతున్నట్టుగా ఫిర్యాదు చేసిన వారే. వీరిపై చేపట్టిన సర్వే విశ్లేషణ ఆధారంగా, మీరు గమనించవలసిన కరోనా సంబంధిత తలనొప్పి లక్షణాలు ఇలా ఉన్నాయి.
కరోనాతో బాధపడుతున్న వారిలో 10% కంటే ఎక్కువ మంది రోగులు 72 గంటలకుపైగా తలనొప్పితో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. 48-72 గంటల కంటే ఎక్కువసేపు ఏదైనా నొప్పి, తలనొప్పి లేదా మయాల్జియా Muscle pain తో బాధపడుతున్నారంటే.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమంది COVID రోగులు విపరీతమైన టెన్షన్‌తో కూడిన తలనొప్పితో కూడా బాధపడవచ్చు. లేదా దగ్గు, చలి జ్వరంతో కూడిన తలనొప్పి వస్తుంది. ఇంకొన్ని కేసుల్లో కరోనా రోగులు 72 గంటలకిపైగా తలనొప్పితో బాధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ పరిశోధనలో తేలింది.
Also read : Ginger health benefits: అల్లం రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
కరోనాతో సోకి తలనొప్పితో బాధపడే వారిలో కనిపించే మరో భిన్నమైన లక్షణం ఏంటంటే.. రుచి, వాసన (Loss of Smell, taste) కోల్పోవడంతో పాటు ఆకలి లేకపోవడం, మత్తుగా, నీరసంగా ఉండటం. ఇంకొంతమందిలో నరాల్లో మంటగా అనిపించడం వంటి లక్షణాలు సైతం కనిపించాయి.
సాధారణంగా కలిగే తలనొప్పి పెయిన్ కిల్లర్స్‌తో (Pain killers) తగ్గిపోతుంది. కానీ కరోనాతో వచ్చే తలనొప్పికి పెయిన్ కిల్లర్స్ అంతగా రిలీఫ్ ఇవ్వలేవు. అంటే పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత కూడా తలనొప్పి తగ్గడం లేదంటే.. అది కరోనా లక్షణం అయి ఉండవచ్చు. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తలనొప్పి తగ్గే అవకాశం కూడా లేదు.
Also read : COVID-19 updates: Pregnant ladies కి షాకింగ్ న్యూస్ !
తలనొప్పులు అన్ని ఒకే రకంలా అనిపించవు. ఒకవేళ మీకు కరోనా సోకినట్టు అనుమానించినట్లయితే, అలా వచ్చే తలనొప్పి (Headache with COVID-19) తీవ్రంగా ఉండవచ్చు. చేసే పనిపై ఏకాగ్రత కోల్పోవడం, మైకం కమ్మేసినట్టు అనిపించడం, ఇంకొంతమందికి వంగి ఉన్నప్పుడు తలనొప్పి తీవ్రమవడం వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తక్షణమే స్పందించి చికిత్స తీసుకోకపోతే.. శరీరంలో ముఖ్యమైన అవయవాల పనితీరులో మార్పులు కనిపించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
కరోనావైరస్ సోకడం వల్ల వచ్చే తలనొప్పి మహిళల్లో (Headache in women) కంటే పురుషులలోనే (Headache in men) అధికంగా కనిపించినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ తేడాకు గల శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేనప్పటికీ.. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ACE2- రోగనిరోధక శక్తిని పొందే గ్రాహకాలను తక్కువ స్థాయిలో కలిగి ఉండటమే దీనికి ఓ కారణమై ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Android Link - https://bit.ly/3hDyh4G