Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 18, 2021 Rasi Phalalu, వారికి తగిన గుర్తింపు

Horoscope Today 18 February 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2021, 07:52 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 18, 2021 Rasi Phalalu, వారికి తగిన గుర్తింపు

Today Horoscope In Telugu 18 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 18న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ వ్యక్తిగత గుర్తింపును నిలుపుకోవడం గతంలో కంటే చాలా ముఖ్యం. అయితే మీరు శుభవార్తలు వింటారు. చాలా విషయాలలో ఆవేశానికి లోనవుతారు. దీనివల్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు జరుగుతాయి.

వృషభ రాశి
మీరు ప్రస్తుతం ఎవరు అనే దానిపై శ్రద్ధ వహిస్తారు. మిమ్మల్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలలో అంతగా కలిసిరాదు. పని ఒత్తిడి అధికం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీ వంతు ప్రయత్నాలు జరుగుతాయి.

మిథున రాశి
నూతన పరిచయాలు జరుగుతాయి. జీవితంలో కొన్ని కొత్తలు ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులకు కలిసొస్తుంది. వ్యాపారాలలో లాభాలు ఆశించవచ్చు. శుభకార్యాలలో భాగస్వామి అవుతారు.

కర్కాటక రాశి
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిపై నియంత్రణ అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులకు కలిసొస్తుంది. ఉద్యోగులు నిరూపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తారు. ఇతరుల పిలుపుమేరకు ప్రయాణాలు చేసి శుభకార్యాలలో పాల్గొంటారు.

సింహ రాశి
కొందరి వ్యవహారం మీలో అనుమానాన్ని పెంచుతుంది. దీనిపై వారిని కచ్చితంగా ప్రశ్నించి నిలదీస్తారు. ఇతరులను గుడ్డిగా విశ్వసించవద్దు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు. కొన్ని అవకాశాలు చేతికొచ్చాయని సంతోషించేలోపే చేజారుతాయి. బంధువులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి.

కన్య రాశి
కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఒక స్నేహితుడు నుంచి తెలుసుకుంటారు. మీ విశ్వసనీయతను కోల్పోకుండా ముందుకు సాగుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. మీరు కోరుకుంటే ప్రయాణాలు చేసే అవకావం ఉంది. 

తులా రాశి
మీపై మీకు నమ్మకం అధికం. తద్వారా మీ పనులు సజావుగా పూర్తి చేస్తారు. వాస్తవాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు తీరే సూచన ఉంది. కుటుంబంతో సరదాగా సమయం గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు కొంతమేర ఆశాజనకంగా ఉంది.

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అదే సమయంలో ఇతరుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని బాధ్యతలు స్వీకరించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. కొన్ని ఆస్తులు మీ చేతికి వస్తాయి. సన్నిహితులు, స్నేహితులు లేదా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇస్తారు.

ధనస్సు రాశి
కొందరితో కలిసి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కనుక మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వ్యవహరించాలనే దానిపై శ్రద్ధ వహించాలి. అధిక ఖర్చులతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. మీ నాయకత్వ లక్షణాలు కొంతమేర సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.

మకర రాశి
మీ పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాలలో అంతగా కలిసిరాదు. పరిస్థితుల ప్రభావంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. అదే సమయంలో మీ నిర్ణయాలు మార్చుకుంటారు. కొందరి నిజరూపాన్ని మీరు గ్రహిస్తారు. అయితే దీనిపై చింతించవద్దు.

కుంభ రాశి
ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. లేకపోతే తరువాత కుటుంబం మొత్తం చింతించాల్సి ఉంటుంది. ఉద్యోగం లేదా అవకాశం గురించి మరింత సమాచారం వచ్చే వరకు వేచి ఉండండి. తొందరపాటు వల్ల సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీన రాశి
మీ వృత్తి జీవితంలో ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మీరు చెప్పేది మీ యజమాని ఇష్టపడరని చింతించకండి. అంతకుమించి శ్రమిస్తారని మీ చుట్టుపక్కలవారికి తెలుసు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. పనులలో జాప్యం ఏర్పడుతుంది. అకారణంగా మీపై నిందలతో సతమతమవుతారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News