Amaravati region: ఏపీ శాసన రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగమేనని గుర్తు చేశారు. అమరావతిలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపధ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్( Andhra pradesh) రాజధాని ప్రాంతంగా గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతి( Amaravati)ని అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని ఏపీ ప్రభుత్వం( Ap Government) ఇప్పటికే స్పష్టం చేసింది. తాత్కాలికం పేరుతో వందల కోట్లు వృధా చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధినీ అమరావతిలో చేయకపోవడంపై వైసీపీ ప్రభుత్వం చాలాసార్లు విమర్శలు చేసింది. ఏపీకు మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినా..అమరావతి మాత్రం శాసన రాజధానిగా కొనసాగనుందని..ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపధ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. అమరావతిలోని నిర్మాణాలపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల్ని పూర్తి చేసేందుకు 3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకు ఇచ్చినట్టు చెప్పారు. తాత్కాలిక భవనాలకే చంద్రబాబు కోట్లు వృధా చేశారని మంత్రి బొత్స విమర్శించారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించి..కనీసం రోడ్డు కూడా వేయలేదన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు చంద్రబాబు ( Chandrababu ) గ్రాఫిక్స్‌లో భాగమని బొత్స ఎద్దేవా చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డును కాజా వరకూ విస్తరించాలని ప్రణాళిక వేస్తున్నామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కి విర్రవీగితే ఇలాంటి ఫలితాలే వస్తాయని ధ్వజమెత్తారు. విశాఖలో భవనాలు నిర్మిస్తుంటే స్టే తెచ్చారని..అయినా సరే విశాఖను కార్యనిర్వాహక రాజధాని ( Visakhapatnam executive capital )గా చేసి తీరుతామని చెప్పారు.
Also read: Sajjala Ramakrishna reddy: చంద్రబాబు ముసుగు తొలగుతోంది, నైజం బయటపడుతోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook