SEC on Volunteers: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వాలంటీర్లపై దృష్టి పెట్టారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు ముందుగా వాలంటీర్లే గుర్తొస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాలంటీర్లపై ఆంక్షలు విధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ( Ap panchayat elections) పోరు ముగిసింది. ఇప్పుడిక మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది. 2020లో కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఎన్నికలు తిరిగి ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec nimmagadda ramesh kumar) మరోసారి వాలంటీర్లపైనే తొలి అస్త్రాన్ని సంధించారు. గతంలో పంచాయితీ ఎన్నికల సమయంలో కూడా వాలంటీర్లపై గట్టిగా ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్ని( Ap municipal elections) పురస్కరించుకుని వాలంటీర్లను ఎన్నికల విధుల్నించి దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో వాలంటీర్ల( Volunteers)పై నిఘా ఉంచడమే కాకుండా వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునే ఈ ఆదేశాలిస్తున్నట్టు ఎస్ఈసీ తెలిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకునే అవకాశముందని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.
Also read: Vijayawada Politics: కేశినేని నానికి చెక్ పెట్టేందుకే గుంటూరు అభ్యర్ధిగా కోవెలమూడి రవీంద్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook