Amaravati land scam: అమరావతి భూముల కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే ఆర్కేకు కూడా నోటీసులు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూకుంభకోణం కేసు (Amaravati land scam)లో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు (CID Notices) అందించింది. ఈనెల 22, 23 తేదీల్లో ఇద్దరినీ విచారణకు హాజరుకావల్సిందిగా కోరింది. మరోవైపు ఇదే కేసులో ఫిర్యాదుదారుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Mla Ramakrishna reddy)కి నోటీసులు అందించారు సీఐడీ అధికారులు. ఇవాళ సీఐడీ అదికారుల ముందు హాజరైన ఎమ్మెల్యే ఆర్కే..తన భూకుంభకోణానికి సంబంధించి తన దగ్గరున్న ఆధారాలన్నింటినీ అందించారు. రైతులకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకే వారి భూముల్ని సొంతం చేసుకున్నారన్నారు. ఈ భూ లావాదేవీలకు సంబంధించి రెవెన్యూ అధిాకరులు ఇవ్వాల్సిన జీవోల్ని మున్సిపల్ శాఖ ద్వారా అక్రమంగా తీసుకున్నారని ఆర్కే ఆరోపించారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 5 వందల ఎకరాల అసైన్డ్ భూముల్ని కాజేసినట్టు తెలిపారు.
తాడికొండతో కలుపుకుంటే మొత్తం 4 వేల ఎకరాల భూమిని లాక్కున్నారని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో రాజధాని రైతులు తనవద్దకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. దళితులకు అన్యాయం జరిగినతే ఎవరైనా కేసు పెట్టవచ్చని చెప్పారు. దళితుడే కావల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు (Chandrababu) నిజంగా తప్పు చేయకపోతే..విచారణకు హాజరు కావాలని సవాల్ విసిరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook