GPS tracker harrassment: అమ్మాయిల్ని, వివాహితల్ని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రబుద్ధులు ఎంతకైనా తెగిస్తున్నారు. అవసరమైతే టెక్నాలజీ వాడుకుంటున్నారు కూడా. అదే జరిగింది హైదరాబాద్‌లో.
హైదరాబాద్ జూబ్లీహిల్స్(Jubilee Hills)లో వైద్యురాలిగా పనిచేస్తున్న ఓ వివాహితకు ఎదురైన వేధింపుల ఘటన ఇది. విశ్వనాధ్ అనే ఓ వ్యక్తి వివాహితైన వైద్యురాలి వెంటపడి వేధిస్తున్నాడు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తూ వేధింపులు తీవ్రం చేశాడు. ప్రేమించాలంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చాడు. తానెక్కడి వెళ్తుందో ఏంటో ఆ వ్యక్తికి ఎలా తెలిసిపోతుందో అర్ధం కాక ఆందోళన చెందింది. ఎన్నిసార్లు హెచ్చరించినా విశ్వనాధ్ తీరు మారలేదు. వేధింపులు ఆపలేదు. దాంతో ఆ వివాహిత భర్తకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె భర్త ..విశ్వనాధ్‌ని హెచ్చరించేందుకు అతడి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో అతడితో పాటు మరికొందరు స్నేహితులున్నారు. హెచ్చరించేందుకు వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాధ్ , అతని స్నేహితుడు శ్రీకాంత్ బెదిరించారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ వైద్యురాలిని వేధించడమే పనిగా పెట్టుకున్న విశ్వనాధ్..ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంతో తెలుసుకునేందుకు ఏకంగా ఆమె కారుకు జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker) అమర్చాడట. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
Also read: COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ, GHMCలో పెరుగుతున్న కోవిడ్19 తీవ్రత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook