COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం

CoWIN Registration Process For Above 45 years: కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి కోవిడ్19 టీకాల పంపిణీ వేగవంతం చేశారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 1, 2021, 04:18 PM IST
  • దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు
  • 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
  • ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి, సులువైన విధానం

COVID-19 Vaccination: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం నాడు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలలో 72 వేలకు పైగా శాంపిల్స్ కోవిడ్-19 పాజిటివ్ అని ధ్రువీకరించారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో కేవలం 6 రాష్ట్రాల నుంచే 80 శాతం వరకు కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా టీకాల పంపిణీని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.

భారతదేశం కరోనా వ్యాక్సిన్లు రూపొందించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు వ్యాక్సిన్ మోతాదులను సైతం అందించి తన సహకారాన్ని అందిస్తోంది. జనవరిలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు కరోనా టీకాల పంపిణీ ప్రారంభించింది. ఆపై ఫిబ్రవరి నెలలో వారికి రెండో డోసు కోవిడ్-19 టీకాలు ఇచ్చారు. అదే సమయంలో 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, 60 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు(Corona Vaccine) ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read: Map My India APP: మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఇలా తెలుసుకోండి

గత కొన్ని వారాలుగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి కోవిడ్19 టీకాల పంపిణీ వేగవంతం చేశారు. కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కరోనా టీకాలు ఇస్తున్నారు. అర్హులైన అందరూ కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని కోవిడ్-19 వ్యాక్సిన్(COVID-19 Vaccine) పొందాలని అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి.

కోవిన్ వెబ్‌సైట్‌లో కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం ఇదే..
స్టెప్ 1: మొదటగా కోవిడ్ (www.cowin.gov.in) వెబ్‌సైట్‌కు వెళ్లండి. లేదా యాప్ అయినా సరే
స్టెప్ 2: మీ 10 అంకెల ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి
స్టెప్ 3: ఆ తరువాత ఓటీపీని ఎంటర్ చేయాలి
స్టెప్ 4: వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఉంటుంది
స్టెప్ 5: మీ ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి
స్టెప్ 6: మీకు ఏ రోజు, ఏ సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటారో స్లాట్ బుక్ చేసుకోవాలి
స్టెప్ 7: మీకు దగ్గర్లోని ఏదైనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సెలక్ట్ చేసుకుని, మీ వివరాలు నిర్ధారించుకున్న తరువాత కన్ఫామ్ చేయాలి.

Also Read: Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x