Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 02, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Today Horoscope In Telugu 02 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 2వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2021, 07:57 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 02, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Horoscope Today 02 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 2వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. మీరు తరువాత ఏం చేయాలనుకుంటున్నారు, దాని కోసం సిద్ధంగా ఉన్నారా? అనే సందేహాలు మొదలవుతాయి. ఈ విషయంలో మీరు ఇతరుల సాయాన్ని కోరతారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. అధికంగా శ్రమించినా ఆశించిన ఫలితాలు పొందలేరు.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

వృషభ రాశి
పనిలో ఉన్న ఎవరైనా ఈ రోజు మీ దృష్టిని ఆకర్షించబోతున్నారు. అయితే ముందుకు మీరు చేయవలసిన పనుల జాబితాలోని అన్ని విషయాలను పరిశీలించుకోండి. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమ, వ్యాయామం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. మీ చేతికి ఆస్తి కలిసిరానుంది. ఉద్యోగులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.

మిథున రాశి
మీరు ఈ రోజు చాలా నమ్మకంగా ఉంటారు. మీ దారిలో నడిచే ఎవరైనా మీకు సన్నిహితులుగా మారనున్నారు. మీకు ముఖ్యమైన సమావేశాలు ఉంటే వాటి షెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలకు ఆటంకాలు తలెత్తుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయమని భావిస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది.

కర్కాటక రాశి 
మీకు తెలిసిన ఒక రహస్యం ఈ రోజు అనుకోకుండా ఇతరుల చేతికి వెళుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీ పరిధులను విస్తృతం చేయండి. కెరీర్ సహా పలు విషయాల గురించి ఆలోచిస్తారు. వస్తు లేదా ధన రూపంలో లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి.

సింహ రాశి
మీరు ఈరోజు గతం గురించి ఆలోచిస్తారు. ఎందుకిలా జరిగింది, అందుకు కారణాలు తెలుసుకునేందుకు మీ మనసు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ నిర్ణయాలను గౌరవించని ఓ వ్యక్తి వాటికి కారణమని తెలుసుకుంటారు.  చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. రుణ యత్నాలు ప్రారంభిస్తారు.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 

కన్య రాశి
మీరు ఒక్కరిగా చేయలేని పనులు మీకు ఇవ్వబడతాయి. అయితే ఈ రోజు పూర్తి బాధ్యత మీపై ఉంటుందని మరిచిపోకూడదు. తీర్థయాత్రలు వెళ్లాలనుకుంటే ఈ రాశివారికి ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడు వీలుకాకపోతే త్వరలో ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకోండి. కొన్ని పనులు పూర్తవుతాయి. చేతికి డబ్బు అందుతుంది.

తులా రాశి
ప్రతి పనిని శ్రద్ధగా చేయాలని భావిస్తుంటారు. కొన్ని పర్యాయాలు ఇది మేలు చేస్తుంది. కొన్ని సందర్భాలలో మీ పనిని క్లిష్టతరం చేస్తుంది. మీ సమస్యలను గమనించి పరిష్కారం కనుగొంటారు. మీ సహోద్యోగులను సంతోషంగా ఉంచడానికి మీ కార్యాలయంలో కొంత ఆనందాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబసభ్యులు, స్నేహితులు మరియు సన్నిహితులతో కొంత సమయం సరదాగా గడుపుతారు.

వృశ్చిక రాశి
ప్రతికూల వ్యాఖ్యలు విని విని మీరు విసిగిపోతున్నారు. మీ అనుకూలతను మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న కొంతమందికి పరిస్థితిని వివరించే ప్రయత్నం ముమ్మరం చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక విషయాలు కలిసొస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

ధనుస్సు రాశి
మీరు ఇటీవల ఏం చేస్తున్నారో ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. కేవలం మీరు ఒక్కరు కష్టపడితే పనులు పూర్తికావనే వాస్తవాన్ని గ్రహించి ముందుకు సాగండి. పనిచేసే చోట అధిక శ్రమ తప్పదు. మీ ఉన్నతాధికారులు దీనిని గమనించబోతున్నారు. మీ ప్రయత్నాలను  అభినందిస్తున్నారు. అప్పులు పెరుగుతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

మకర రాశి
మీరు కొన్ని విషయాలు సాధించినందున కాస్త వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించండి. మీరు ఈ రోజు సన్నిహితులు, బంధువులత6 ఎక్కువ సమయం గడపబోతున్నారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు ప్లస్ పాయింట్ కానున్నాయి. ఉద్యోగులకు పనిలో కలిసొస్తుంది. ఆస్తి చేతికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక కార్యక్రమాల గురించి ఆలోచించనున్నారు.

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి

కుంభ రాశి
మీ కంటే తక్కువ వయస్సు గల ఎవరైనా ఈ రోజు మీ నుండి ముఖ్యమైన సమాచారాన్ని పొందబోతున్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే అప్పుల బాధ తప్పుతుంది. సరైన ప్లాన్ లేకపోతే ఆర్థిక పరమైన విషయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. 

మీన రాశి
ఈ రోజు మీ భావాలను వ్యక్తీకరించడానికి మంచి రోజు. మీరు విషయాలు చర్చించే వ్యక్తి అన్ని సానుకూల సమాధానాలతో మీకు స్వాగతం పలుకుతారు. పనిలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కానీ మీ అద్భుతమైన పని నైపుణ్యాలు మీకు నాయకత్వం వహించడానికి మరియు పనిని త్వరగా పూర్తి చేయడంలో సహాయపడతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలతో మేలు జరుగుతుందని భావిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News