Zilla parishad Elections: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. జిల్లా పరిషత్ ఎన్నికల బహిష్కరణపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని స్పష్టం చేశారు.
ఏపీలో జిల్లా పరిషత్ ఎన్నికల(Zilla parishad Elections) సమరం మోగింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం (Telugu Desam) జిల్లా పరిషత్ ఎన్నికల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra reddy) స్పందించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు రావని తెలిసే ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడుతున్నారంటూ చంద్రాబుని ఎద్దేవా చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అయిపోయి..పోలింగ్‌కు 5 రోజులుంటగా బహిష్కరణ ఏంటని ప్రశ్నించారు. బహిష్కరణ అంటూనే బలంగా ఉన్నచోట డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. మొదట్నించి చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమేనన్నారు.
అటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సైతం చంద్రబాబు(Chandrababu)పై మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర హీనుడని..ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా ఎన్నికల్ని బహిష్కరించలేదన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయానుభవం ఏమైందని ప్రశ్నించారు. ఘోర ఓటమిని ఊహించే ఎన్నికల్ని బహిష్కరించారని..కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుత పాలన ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారన్నారు. ఏ ఎన్నిక జరిగినా సరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr Congress party) దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Also read: TDP Boycott Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై టీడీపీ కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook