Jayalalitha Biopic: జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు లైన్ క్లియర్

Jayalalitha Biopic: తమిళనాడు అమ్మ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. జయలలిత జీవితాధారిత వెబ్‌సెరీస్, చిత్రాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2021, 05:22 PM IST
Jayalalitha Biopic: జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు లైన్ క్లియర్

Jayalalitha Biopic: తమిళనాడు అమ్మ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్స్‌కు మద్రాస్ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది. జయలలిత జీవితాధారిత వెబ్‌సెరీస్, చిత్రాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.

తమిళనాడు (Tamilnadu) మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత( Jayalalitha Biopic) చరిత్ర ఆధారంగా పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మాణంలో ఉన్నాయి. జయలలితకు వారసులు తామేనని చెప్పుకుంటున్న ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లు సాగిస్తున్న న్యాయపోరాటంతో పాటు ఈ చిత్రాలకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తమ మేనత్త జీవిత ఇతివృత్తంతో తెరకెక్కుతున్న వెబ్‌సిరీస్, చిత్రాల్లో తమ కుటుంబానికి వ్యతిరేకంగా అంశాలున్నాయని..వాటిపై స్టే విధించాలని పిటీషన్ దాఖలు చేశారు. తొలుత ఈ పిటీషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ తోసిపుచ్చడంతో దీప మరో బెంచ్‌కు అప్పీల్ చేశారు. 

దీనిపై మద్రాస్ హైకోర్టు( Madras High Court)లో వాదనలు సాగాయి. తలైవి అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని..ఇందులో ఆమెకు అంటే జయలలితకు వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు లేవని..ఆమె అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని వాదన విన్పించారు. దాంతో కోర్టు దీప పిటీషన్‌ను తోసిపుచ్చడమే కాకుండా..ఆ చిత్రాలకు లైన్ క్లియర్ ( Line Clear )చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా క్విన్ పేరిట వెబ్‌సిరీస్, తలైవి, జయ పేరిట చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. 

Also read: Ishq Pre Release Event: పార్క్ హయత్‌లో ఇష్క్ ప్రి రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x