COVID-19 Positive Children: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే మహమ్మారిని జయించవచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడిన వారికి ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తుంది. మే 1వ తేదీ నుంచి కరోనా మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడిన అందరికీ దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు తీసుకోవడానికి అర్హులవుతారు.
ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్న మరో సమస్య ఏంటంటే, చిన్నారులను కరోనా బారి నుంచి రక్షించుకోవడం. వారికి ఇప్పట్లో కోవిడ్19 టీకాలు ఇచ్చే ప్రసక్తే లేదు కనుక చిన్నారులను కరోనా నుంచి సురక్షితంగా ఉంచడానికి వైద్యులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. బీఎల్‌ఎక్స్-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రచనా శర్మ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారు. COVID-19 Positive చిన్నారులను వెంటిలేషన్ అధికంగా ఉన్న గదులలోనే హోం ఐసోలేషన్‌లో ఉంచాలని, ఆ గదికి అటాచ్ టాయ్‌లెట్ లేదా ప్రత్యేకంగా ఒక్కరే వాడేలా టాయిలెట్ ఉండాలని సూచించారు.
Also Read: KTR COVID19 Positive: మొన్న సీఎం కేసీఆర్‌కు, నేడు మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
చిన్నారులకు కోవిడ్19 సలహాలు, జాగ్రత్తలు
- కోవిడ్19 సోకిన చిన్నారులను వెంటిలేషన్ అధికంగా ఉండే గదిలో ఐసోలేషన్‌లో ఉంచాలి. ఆ గదికి అటాచ్ టాయిలెట్ ఉంటే అది మరింత ప్లస్ పాయింట్ కానుంది
- కరోనా బారిన పడిన చిన్నారులను పెద్ద వయసువారు, గర్భిణులు, ఇతర చిన్నారులు, కరోనా బారిన పడిన వారికి దూరంగా ఉంచాలి
- ఆ చిన్నారుల పనులు చూసుకోవడం, వారికి సహాయం చేసేందుకు ప్రత్యేకంగా ఓ మనిషి ఉండాలి
- నీళ్లు అధికంగా తాగుతూ ఉండాలి. ఒకేసారి కాకుండా స్వల్ప విరామాలలో గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి.
- పసిపిల్లలకు అయితే, తల్లి మాస్క్(Face Mask) ధరించి, చేతులు శుభ్రం చేసుకున్న తరువాతే పాలు ఇవ్వాలి.
- అవసరం అనుకుంటే తల్లి పాలు తీసి, సహాయకుల ద్వారా ఆ పసివారికి పాలు పట్టాలి
- చిన్నారులు తిన్న పాత్రలు, వారు వాడిన వస్తువులను ఇతరులు తాకకుండా చూసుకోవాలి.
Also Read: New COVID-19 Guidelines: మే 1 నుంచి మూడో దశలో కరోనా వ్యాక్సినేషన్, కేంద్రం మార్గదర్శకాలివే
కేర్ టేకర్స్‌కు సలహాలు, సూచనలు
కరోనా సోకిన చిన్నారులకు మీకు సహాయకులు, వారి ఆలనాపాలనా చూసేవారైతే ఈ విషయాలు గుర్తుంచుకోండి
- ఎల్లప్పుడూ సర్జికల్ మాస్కులు ధరించి ఉండాలి. ప్రతి 6 నుంచి 8 గంటల్లోపు ఒకసారి మాస్కులు మార్చాల్సి ఉంటుంది
- ఇన్‌ఫెక్షన్ సోకిన చిన్నారుల మలమూత్రలు చేతితో నేరుగా కడగటం, తీయడం చేయకూడదు.
- డిస్పోజబుల్ గ్లౌజులు ధరించి కరోనా సోకిన చిన్నారుల వస్తువులను తాకాలి, వారి ఆహారం, పాత్రలు కడగటం చేయాలి.
- కరోనా సోకిన చిన్నారులు ఉపయోగించే బాత్రూమ్‌లు ప్రతిరోజూ శుభ్రం చేయాలి. బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ మిశ్రమాలతో శుభ్రం చేయాల్సి ఉంటుంది
- వేడి చేసిన నీళ్లల్లో కరోనా సోకిన చిన్నారుల దుస్తులు, టవల్, ఖర్చీఫ్ లాంటివి ఉతకాలి. లేదా 60 నుంచి 90 డిగ్రీల వేడిలో మెషీన్ వాష్ చేయాలని సూచించారు.
బీఎల్‌ఎక్స్-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సలహాలు, సూచనలు ఇక్కడ మీకు అందిస్తున్నాం.
Also Read: COVID-19 Dos And Donts: కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే ఏం చేయాలి, చేయకూడదో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook