Vaccine Registration: దేశంలో వ్యాక్సినేషన్ మూడవ దశ ప్రారంభం కానుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని తప్పనిసరి మార్గదర్శకాలు జారీ చేసింది.
దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ (Corona vaccination) ప్రక్రియ కొనసాగుతుంటే..మరోవైపు కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) భయంకరంగా విస్తరిస్తోంది. ప్రజల్ని గజగజ వణికిస్తోంది. ఈ నేఫధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వ్యాక్సినేషన్ మూడవ దశ ప్రారంభించనుంది కేంద్రం. మే 1 వ తేదీ నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సు వారికి కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే దీనికోసం తప్పనిసరి మార్గదర్శకాలు జారీ చేసింది.
18 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తప్పనిసరిగా కోవిన్ వెబ్ పోర్టల్(Cowin web portal) లో రిజిస్ట్రేషన్ చేయించుకోవల్సి ఉంటుంది. ప్రసుతం 45 సంవత్సరాలు పైబడినవారికిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా కోవిన్ వెబ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలన్న నిబంధన ఉంది కానీ..ఆధార్ కార్డుతో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్తే వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు.అక్కడికక్కడే వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అయితే కోవిడ్ వైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ తరుణంలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే కోవిన్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ (Cowin app registration) చేయించుకోవల్సి ఉంటుంది. దీనికోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి.
Also read: Corona New Strain: పొరుగుదేశంలో ప్రమాదకర కరోనా వైరస్ గుర్తింపు, ఇండియాలో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook