Zee Digital launches Progressive Web Apps: న్యూ ఢిల్లీ: ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే జీ మీడియా ఇప్పటికే కొనసాగుతున్న తమ డిజిటల్ ప్రాపర్టీస్‌కి సంబంధించి తాజాగా 9 భాషల్లో మొత్తం 13 ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ లాంచ్ చేసింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇదొక అతి పెద్ద పీడబ్ల్యూఏ లాంచింగ్ కార్యక్రమంగా జీ డిజిటల్ అభివర్ణించింది. ఈ ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ లాంచింగ్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద సాంకేతిక దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విటర్, అలీబాబ, ఉబర్, లింక్డ్ఇన్ వంటి సంస్థల సరసన జీ డిజిటల్ చేరినట్టు జీ మీడియా ప్రకటించింది.
జీ డిజిటల్ లాంచ్ చేసిన పీబీఏతో దేశంలోనే అత్యధిక వ్యూయర్షిప్ కలిగిన ZeeNews.com, Zee24Ghanta.com, ZeeHindustan.in, Zee24Kalak.in, 24Taas.com, ZeeRajastha.com, ZeeBiharJharkhand.com, ZeeUpUk.com, and ZeeMpCg.com లాంటి పెద్దపెద్ద బ్రాడ్కాస్ట్ న్యూస్ బ్రాండ్స్‌ని మొబైల్ వెబ్‌లో మరింత ఆహ్లాదకరంగా వీక్షించేందుకు వీలు కలగనుంది. ఇప్పటికే గత ఏడాది కాలంగా నెలవారీ యూజర్స్ పరంగా 65% వృద్ది నమోదు చేసుకున్న ఈ బ్రాండ్స్‌లో ఈ పీబీఏ లాంచింగ్‌తో మరో 200% ఆర్గానిక్ ట్రాఫిక్ నమోదవుతుందని జీ డిజిటల్ అంచనా వేస్తోంది.
తమ యూజర్స్‌కి తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న ప్రాంతాల్లోనూ, స్టోరేజీ ఎక్కువగా లేని సాధారణ స్మార్ట్ఫోన్లలోనూ రెట్టింపు వేగంతో వార్తలు చూసే వీలు అందించడంతో పాటు ఆఫ్లైన్లోనూ న్యూస్ బ్రౌజ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది జీ డిజిటల్. అంతేకాకుండా తమ ఫేవరైట్ న్యూస్ బ్రాండ్స్‌ని హోమ్‌స్క్రీన్‌పై యాడ్ చేసుకునే వెసులుబాటు కూడా అందిస్తోంది.
Also read: Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి ?
ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ లాంచింగ్‌పై జీ డిజిటల్ సీఈఓ రోహిత్ చద్దా (Rohit Chadda, CEO, ZEE Digital) మాట్లాడుతూ.. ''దేశంలోనే అత్యథిక సంఖ్యలో వ్యూయర్స్ కలిగిన అతిపెద్ద మీడియా సంస్థగా దేశం నలుమూలలా, మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు వీలైనంత ఎక్కువ మందికి తమ వార్తలు చేరవేయాలనేదే తమ ప్రధాన ధ్యేయం'' అని అన్నారు. 'ముఖ్యంగా ఇంటర్నెట్ స్పీడ్ (Poor network areas) అంత ఎక్కువగా లేని మారుమూల ప్రాంతాల్లో, బేసిక్ మోడల్ స్మార్ట్‌ఫోన్ (Smartphones with low storage) ఉన్న వారు సైతం పీడబ్య్లూఏతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం వార్తలు చూసే వెసులుబాటు కలగనుంది. మరీ ముఖ్యంగా వార్తలు చూసే వారి స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజీని వృధా చేయకుండానే వార్తలు అందించడం తాము లాంచ్ చేసిన పీడబ్ల్యూఏ ప్రత్యేకత అని' చద్దా తెలిపారు. వార్తాంశాలు, వీడియోలు చూసేందుకు ఇంటర్నెట్ స్పీడ్ లేదే అని ఆందోళన చెందే వారికి, లేదా తమ మొబైల్లో స్టోరేజీ లేదు కదా అని దిగాలు పడేవారికి తమ జీ డిజిటల్ లాంచ్ చేసిన ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ ఓ చక్కటి పరిష్కారం కానుంది అని చద్దా చెప్పుకొచ్చారు.
Also read : Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
మొబైల్ ఫస్ట్ అనే జీ డిజిటల్ స్ట్రాటెజీని దృష్టిలో పెట్టుకునే మొబైల్ యాజర్స్ సౌలభ్యం కోసమే ఈ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ లాంచ్ చేసినట్టు జీ డిజిటల్ ప్రకటించింది. లైవ్ టీవీ, వీడియోలకే అధిక ప్రాధాన్యత కలిగిన ప్రస్తుత తరుణంలో ఈ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ తమ యూజర్స్‌కి మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని అందించనున్నాయి. అంతేకాకుండా యూజర్స్ తమకు నచ్చిన ఛానెల్‌ని లైవ్‌లో ఏ అంతరాయం లేకుండా (Uninterrupted news consumption) వీక్షించేందుకు వీలుగా 'వాచ్' అనే సెక్షన్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇకపై తక్కువ సమయంలోనే, తక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌తోనే మీకు నచ్చిన Live tv ఎక్స్‌పీరియెన్స్‌ని ఆస్వాదించవచ్చు అని చద్దా తెలిపారు.
గత ఏడాది కాలంగా జీ డిజిటల్ నుండి ZEE Hindustan, ZEE Business, India.com, ZEE 24 Ghanta వంటి వెబ్‌సైట్స్‌కి సంబంధించిన మొబైల్ యాప్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలోనే India.com వెబ్‌సైట్‌కి సంబంధించిన మొబైల్ సైట్ కూడా లాంచ్ చేయగా.. యూజర్స్ నుంచి భారీ స్పందన కనిపించినట్టు రోహిత్ చద్దా తెలిపారు. మొబైల్ సైట్ లాంచింగ్ కారణంగా ఇండియా.కామ్ నెలవారీ యూజర్స్ గణాంకాల్లో భారీ వృద్ది కనిపించినట్టు చద్దా వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook