Bill Gates Divorce: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఇయన సతీమణి మెలిండా గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి (భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి) అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వారిద్దరూ కలిసి ఇక ముందుకు సాగడం వీలుకాదని నిర్ణయించుకున్నాక సోషల్ మీడియాలో తమ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు.
బిల్‌బెలిండాగేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘చాలా ఏళ్ల నుంచి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. భార్యాభర్తలుగా ఎన్నో విషయాలపై చర్చించాం. చివరగా తమ 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని(Bill Gates And Melinda Divorce) నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి ఎవరి దారి వారిదే. మా విడాకుల నిర్ణయాన్ని స్వాగతిస్తారని భావిస్తున్నాం. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలను పెంచి పెద్దచేశాం. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని’ బిల్‌గేట్స్(Bill Gates), మెలిండా పేర్కొన్నారు.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, వెండి ధరలు
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోసం భవిష్యత్తులోనూ కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. కానీ జీవితంలో మాత్రం ఇకనుంచి ఒకేతాటిపై మేమిద్దరం నడవలేమన్నారు. ఈ కొత్త జీవితంలో మాకు కాస్త ప్రైవసీ అవసరం ఉంది, దానికి భంగం కలిగించకూడదని ప్రకటనలో కోరారు. అమెరికా, సీటెల్‌లోని కింగ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
Also Read: COVID-19 Vaccine: భారత్‌కు కరోనా వ్యాక్సిన్ ఫార్ములా ఇవ్వకూడదు, Bill Gates సంచలన వ్యాఖ్యలు
ప్రపంచంలోని కుబేరులలో ఒకరైన బిల్‌గేట్స్ వయసు 65 ఏళ్లు కాగా, మెలిండా వయసు 56 ఏళ్లు. బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్(Microsoft) సంస్థను ఏర్పాటు చేసిన సమయంలో ప్రొడక్ట్ మేనేజర్‌గా మెలిండా పనిచేశారు. ఎంబీఏ పూర్తి చేసిన అతికొద్ది మందిలో మెలిండా ఒకరు, చురుకుగా వ్యవహరించే వ్యక్తి కావడంతో బిల్‌గేట్స్ ఆమెను 1994లో వివాహం చేసుకున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ స్థాపించి గత రెండు దశాబ్దాలుగా ఎనలేని సేవ చేశారు. 2019 చివరి నాటికి 43.3 బిలియన్ అమెరికా డాలర్ల సంపద ఫౌండేషన్ పేరిట ఉంది. ఓవరాల్‌గా గత ఫిబ్రవరి నాటికి బిల్‌గేట్స్ సంపద విలువ 137 బిలియన్ డాలర్లు అని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook