Mann Ki Baat On June 27: కరోనా కాలంలో డాక్టర్ల పాత్రకు మనందరం రుణగ్రస్తులమని, డాక్టర్లు వారి ప్రాణాలను లెక్కచేయకుండా మనందరికీ సేవ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఈసారి నేషనల్ డాక్టర్స్ డే మరింత ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సైన్స్‌ను అందరూ నమ్మాలన్నారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులను మనం నమ్మాలని కోరారు. తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నానని, దాదాపు 100 ఏళ్ల వయసు ఉన్న తన తల్లి సైతం కోవిడ్19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. కనుక కరోనా వ్యాక్సిన్లపై వదంతులు నమ్మవద్దని, ధైర్యంగా ముందుకొచ్చి టీకాలు తీసుకోవాలని Mann ki Baat లో మాట్లాడుతూ సూచించారు. ప్రపంచ వైద్య రంగంలో అత్యంత గౌరవనీయులైన వ్యక్తుల్లో హిపోక్రటీస్ ఒకరని, ఎక్కడైతే.. Art of Medicine పట్ల ప్రేమ ఉంటుందో అక్కడ మానవత్వం పట్ల కూడా ప్రేమ ఉంటుందని ఆయన మాటలు గుర్తుచేశారు. డాక్టర్లు ఈ ప్రేమ శక్తితోటే మనకు సేవ చేయగలుగుతారు. మనం కూడా అంతే ప్రేమతో వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి ధైర్యాన్ని పెంపొందింపచేయాలన్నారు.
Also Read: Delta Plus Variant Cases: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, డెల్టా కేసులతో బీ కేర్‌ఫుల్
PM @narendramodi urges the nation to overcome vaccine hesitancy.
Says - I have taken both doses. My Mother is almost hundred years old, she has taken both vaccines too. Please do not believe any negative rumours relating to vaccines. #MannKiBaat https://t.co/bmm838DK8Y
— PMO India (@PMOIndia) June 27, 2021
జూన్ 21న ఇండియాలో వ్యాక్సిన్ ఉద్యమ రెండోదశ ప్రారంభమైందన్నారు. ఆ ఒక్కరోజులోనే దేశంలో 86లక్షల కంటే ఎక్కువ మందికి ఉచితంగా టీకాలు ఇచ్చి రికార్డు నెలకొల్పామన్నారు. గత ఏడాది కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది అనే సవాల్ మన ముందు ఉండేదని, ఇప్పుడు ఒక్కరోజులోనే లక్షలాది మందికి మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం. నవభారత శక్తికి ఇదే తార్కాణమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పేర్కొన్నారు. కష్టాలు అనుభవించిన తర్వాత సాధించిన విజయమిచ్చే ఆనందం చాలా విభిన్నంగా, గొప్పగా ఉంటుందన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల ఉత్సవానికి సాక్ష్యులుగా మనం ఉండడం నిజంనగా మన అదృష్టం అన్నారు. అందుకే వచ్చేసారి మన్ కీ బాత్ లో కలుసుకున్నప్పుడు అమృత మహోత్సవ ఏర్పాట్లు గురించి కూడా మాట్లాడుకుందామని చెప్పారు. అమృతమహోత్సవంలో ఏ విధంగా వీలైతే.. అందరూ పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త కొత్త ప్రయత్నాలతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, అదే సమయంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook