Disha App: దిశ యాప్ ఎలా పని చేస్తుంది, ప్రయోజనాలేంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

Disha App: మహిళల భద్రతకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు దిశ యాప్ ప్రారంభించింది. దిశ యాప్ ఎలా పనిచేస్తుంది..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనే వివరాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2021, 12:16 PM IST
Disha App: దిశ యాప్ ఎలా పని చేస్తుంది, ప్రయోజనాలేంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

Disha App: మహిళల భద్రతకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు దిశ యాప్ ప్రారంభించింది. దిశ యాప్ ఎలా పనిచేస్తుంది..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనే వివరాలు పరిశీలిద్దాం.

ఏపీ ప్రభుత్వం అమల్లో తెచ్చిన దిశ చట్టం(Disha Act)ఆశించిన ఫలితాలు చూపిస్తోంది. అదే సమయంలో ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన దిశ యాప్‌కు ఆదరణ లభిస్తోంది. 2020 ఫిబ్రవరిలో ప్రారంభమైన దిశ యాప్‌ను ఇప్పటికే 17 లక్షలమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ ద్వారా వేయి ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.160 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాదాపుగా వేయిమంది మహిళలు, అమ్మాయిల్ని ప్రమాదాల బారినుంచి దిశ యాప్ రక్షించింది. ఇప్పుడు దిశ యాప్‌ను మరింతగా మహిళలకు చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. 

దిశ యాప్ ప్రయోజనాలు, ఎలా పనిచేస్తుంది( Disha App Uses, How it works)

యువతులు, మహిళలు ఆపదనలో ఉన్నప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబసభ్యులు లేదా స్నేహితులకు తక్షణం సమాచారం చేరవేసే ఏర్పాటు ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాక్ మై ట్రావెల్(Track my Travel)ఆప్షన్ ఉంటుంది. చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. వాహనం దారి తప్పితే ఆ సమాచారం వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంధు మిత్రులకు చేరవేస్తుంది. దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నెంబర్లతో పాటు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామా కేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలుంటాయి. కమాండ్ కంట్రోల్ నుంచి పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఒకే సమయంలో అందరికీ సలహాలు, సూచనలు ఇస్తారు. విపత్కర పరిస్థితుల్లో సమయం లేకపోతే ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు..పోలీసులకు సందేశం చేరిపోతుంది. అప్రమత్తమైన పోలీసులు కాల్ బ్యాక్ చేస్తారు. ఫోన్‌కు స్పందించకపోతే పోలీసు వాహనంలో ఉన్న మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్(GPS Tracking)ద్వారా బాదితులు ఉన్న లొకేషన్‌కు పోలీసులు చేరుకుంటారు. 

Also read: FIR on Twitter: ట్విట్టర్‌పై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు, తప్పుడు మ్యాప్ ఫలితం

దిశ యాప్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి(How to Download Disha App)

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ పూర్తయ్యాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి..పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నెంబర్, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నెంబర్లు వంటి వివరాల్ని నమోదు చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్‌లో(Disha App)ఉన్న ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఫోన్ నెంబర్, చిరునామా, లొకేషన్‌తో సహా వాయిస్ పది సెకన్లు రికార్డు చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పంపేలా ఏర్పాటుంది. 

Also read: YS Jagan: ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News