Sputnik v vaccine: రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కీలక విషయాన్ని ప్రకటించింది. స్పుత్నిక్ వి కమర్షియల్ లాంచ్ త్వరలో జరగనుందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్ధ్యం గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ (Sputni v vaccine)అందుబాటులో ఉన్నా దేశీయంగా పంపిణీ ప్రారంభం కాలేదు. ఈ నేపధ్యంలో స్పుత్నిక్ వి అందుబాటులో వస్తే వ్యాక్సిన్ కొరత తీరుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో డాక్టర్ రెడ్డీస్ (Dr Reddys Labs) కీలక విషయాన్ని వెల్లడించింది. స్పుత్నిక్ వి కమర్షియల్ లాంచ్ త్వరలో జరగనుందని..నిలిచిపోలేదని స్పష్టం చేసింది. స్పుత్నిక్ వి అందుబాటులో వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 91.6 శాతం సామర్ధ్యంతో పనిచేస్తుందని ప్రయోగాల్లో తేలింది. మే 14వ తేదీన పైలట్ ప్రాతిపదికన ఇండియాలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఆగస్టు-డిసెంబర్ మధ్య కాలంలో దేశీయంగా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి పూర్తి కానుంది. అదే జరిగితే వంద మిలియన్ల స్పుత్నిక్ వి డోసుల్ని టార్గెట్ చేసుకుంది కేంద్ర ప్రభుత్వం(Central government).
Also read: Darbhanga Blast: దర్భంగా పేలుడు ఘటనలో నిందితులు ఢిల్లీకు తరలింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook