Danish Siddique: దానిష్ సిద్ధీఖ్ మరణానికి కారణం తాము కాదంటున్న తాలిబన్లు

Danish Siddique: ఇండియన్ ఫోటో జర్నలిస్టు దానిష్ సిద్దిఖి మరణంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తాలిబన్ల కాల్పుల్లో మరణించాడనే వార్తల్ని ఆ సంస్థ ఖండించింది. దానిష్ మరణంలో తమ ప్రమేయం లేదంటున్నారు తాలిబన్లు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2021, 10:55 AM IST
Danish Siddique: దానిష్ సిద్ధీఖ్ మరణానికి కారణం తాము కాదంటున్న తాలిబన్లు

Danish Siddique: ఇండియన్ ఫోటో జర్నలిస్టు దానిష్ సిద్దిఖి మరణంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తాలిబన్ల కాల్పుల్లో మరణించాడనే వార్తల్ని ఆ సంస్థ ఖండించింది. దానిష్ మరణంలో తమ ప్రమేయం లేదంటున్నారు తాలిబన్లు.

ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) ఆఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మధ్య గత కొద్దిరోజులుగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్ని కవర్ చేసేందుకు ఇండియన్ ఫోటో జర్నలిస్టు దానిష్ సిద్దీఖి వెళ్లి..ఆ కాల్పుల్లో చిక్కుకుని మరణించాడు. తాలిబన్లు కాల్పుల్లోనే దానిష్ సిద్దీఖి (Danish Siddique) మరణించాడని ఇప్పటికే వెల్లడైంది. అయితే తానిబన్లు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అతని మరణంలో తమ ప్రమేయం లేదంటున్నారు. ఎవరి కాల్పుల కారణంగా దానిష్ మరణించాడనే విషయంలో తమకు ఎటువంటి సమాచారం లేదని..ఎలా చనిపోయాడో తెలియదని తాలిబన్ల (Talibans)ప్రతినిధి జబుల్లా ముజాహిదీన్ సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వాస్తవానికి వార్‌జోన్‌లో వచ్చే ప్రతి జర్నలిస్టు తమకు సమాచారం ఇవ్వాలని..అప్పుడే వారి గురించి తగిన రక్షణ తీసుకోగలమని సీఎన్ఎన్(CNN)ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి తెలిపారు. జర్నలిస్టులు ఎటువంటి సమాచారం లేకుండానే రణక్షేత్రంలో వస్తున్నారని..ఇది బాధాకరమని చెప్పారు. దానిష్ మృతదేహాన్ని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. 

Also read: Eagle Policy: చైనా ఆధిపత్యానికి చెక్, ఈగిల్ చట్టానికి ఆమోదం తెలిపిన అమెరికా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News