Taiwan Vaccine: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా మరో వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. తైవాన్‌లో తయారైన మెడిజెన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించినట్టు తెలుస్తోంది.
కోవిడ్19 నియంత్రణకై తైవాన్ ప్రభుత్వం(Taiwan government)వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న తరుణంలో స్థానికంగా అభివృద్ది చేసిన వ్యాక్సిన్ మెడిజెన్కు అత్యవసర అనుమతి లభించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లా(Astrazeneca vacccine)సమర్ధవంతంగా పనిచేస్తుందని..మెరుగైన ఫలితాల్ని ఇస్తుందని పరిశోధనలో వెల్లడైంది.ఈ విషయాన్ని తైవాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిపుణుల బృందం మెడిజెన్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం తెలిపింది. ఆగస్టు మొదటి వారంలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందని తైవాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎమ్వీసీ-కోవ్ 1901 పేరుతో మెడిజెన్ వ్యాక్సిన్ (Medizen vaccine) బయోలాజికల్స్ కార్పొరేషన్ ఉత్పత్తి చేయనుంది. రెండో దశ ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చాయని..అయితే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావల్సి ఉందని స్పష్టం చేసింది. 20 ఏళ్లు నిండినవారికే వ్యాక్సిన్ అందిస్తామని తైవాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతానికి తైవాన్(Taiwan)కు అమెరికా, జపాన్‌లు వ్యాక్సిన్లను విరాళంగా పంపించాయి. అమెరికా నుంచి 25 లక్షల వ్యాక్సిన్లు, జపాన్ నుంచి 3.37 మిలియన్ల వ్యాక్సిన్లు అందాయి. 23 మిలియన్ల జనాభా కలిగి తైవాన్ సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ది చేసుకోవడం శుభ పరిణామం.
Also read: Low Back Pain Tips: నడుము నొప్పి వేధిస్తుందా, ఈ చిట్కాలతో Back Pain మటుమాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook