COVID-19 vaccines for kids: చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్లు.. క్లారిటీ ఇచ్చిన గులేరియా

Covid vaccines for kids: న్యూ ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికలు నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా ఓ గుడ్‌న్యూస్ (Good news for parents) చెప్పారు. కొవిడ్ థర్డ్ వేవ్ (Corona third wave) చిన్న పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని హెచ్చరికలు వినబడుతున్న ప్రస్తుత తరుణంలో రణ్‌దీప్ గులేరియా చెప్పిన గుడ్ న్యూస్ చిన్నారుల తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2021, 12:00 AM IST
COVID-19 vaccines for kids: చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్లు.. క్లారిటీ ఇచ్చిన గులేరియా

Covid vaccines for kids: న్యూ ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికలు నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా ఓ గుడ్‌న్యూస్ (Good news for parents) చెప్పారు. ముందు నుంచి చెబుతూ వస్తున్నట్టుగానే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించేందుకు అసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రణ్‌దీప్ గులేరియా తెలిపారు. 

చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ల కోసం మొత్తం మూడు కంపెనీలకు ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని రణ్‌దీప్ గులేరియా ధీమా వ్యక్తంచేశారు. వ్యాక్సినేషన్‌‌తో పిల్లలను కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ (Corona infection) బారిన పడకుండా కాపాడుకోవడమే కాకుండా... వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా చైన్‌ను బ్రేక్ చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also read : India Corona Update: దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ, 24 గంటల్లో 39 వేల కేసులు

కొవిడ్ థర్డ్ వేవ్ (Corona third wave) చిన్న పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని హెచ్చరికలు వినబడుతున్న ప్రస్తుత తరుణంలో రణ్‌దీప్ గులేరియా చెప్పిన గుడ్ న్యూస్ చిన్నారుల తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే, చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడే వారికి ఇంకొంత ఉపశమనం (Relief) లభించనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also read :Health tips: వ్యాయమంతో Weight loss, fitness మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News