Covid Booster Dose: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా విముక్తి కాలేదు. వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫలితంగా వ్యాక్సినేషన్ రక్షణపై ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే బూస్టర్ డోసుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.
కరోనా వైరస్(Corona virus) అంతకంతకూ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లకు దారి తీస్తోంది. వేరియంట్ మారేకొద్దీ వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వ్యాక్సినేషన్ ఏ మేరకు రక్షణ కల్పిస్తుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయి, మూడవ డోసు అవసరమా కాదా అనే చర్చ ప్రారంభమైంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాల్లో బూస్టర్ డోసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగ నిరోధక శక్తి (Immunity Power)తగ్గినవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరం. కిడ్నీ మార్పిడి జరిగిన 40 మంది రోగుల్లో 39 మందికి, డయాలసిస్ చేయించుకున్నవారిలో మూడవవంతు మందికి వ్యాక్సినేషన్ అనంతరం యాంటీబాడీలే కన్పించలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీరిలో బూస్టర్ డోసు తరువాతే యాంటీబాడీలు కన్పించాయి. అయితే అమెరికాలోని వర్జీనియా యూనివర్శిటీ మైక్రో బయాలజిస్టులు బూస్టర్ డోసు (Vaccine Booster Dose)విషయమై వివరణ ఇచ్చారు. అమెరికా ఆరోగ్య సంస్థలైతే బూస్టర్ డోసుపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇజ్రాయిల్‌లో మాత్రం 60 ఏళ్లుదాటినవారికి బూస్టర్ డోసు ఇవ్వాలంటున్నారు. ఇక ఫ్రాన్స్ దేశంలో ఈ విషయమై చర్చ సాగుతోంది.
బూస్టర్ డోసు ఎందుకు
వైరస్ , బ్యాక్టీరియాలు కల్గించే వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్ తీసుకుంటుంటాం. ఆ వైరస్‌కు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు (Antibodies)వృద్ధి చెంది..వాటితో పోరాడి నిర్వీర్యం చేస్తాయి. వ్యాక్సిన్ ద్వారా లభించే రోగనిరోధకత రోజులు గడిచే కొద్దీ తగ్గుతుంది. అందుకే చాలా వ్యాధులకు మనం తీసుకుంటున్న వ్యాక్సిన్లకు ఏడాది లేదా కొంతకాలం తరువాత బూస్టర్ డోసు ఇస్తుంటాం. అమెరికాలో తీసుకుంటున్న వ్యాక్సిన్లతో 11 నెలల తరువాత కూడా యాంటీబాడీలు కన్పిస్తుండటంతో బూస్టర్ డోసుపై ఆసక్తి కన్పించడం లేదు. అయితే కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునే ఐఐజీ పరీక్షల్ని బట్టి బూస్టర్ డోసు అవసరమా కాదా అనేది తెలుస్తుంది.
Also read: అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook