Afghan Situation: ఆఫ్ఘనిస్తాన్..తాలిబన్ల వశమైన అనంతరం తలెత్తుతున్న పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన సీ 17 విమానంలో ఎక్కిన ప్రయాణీకుల సంఖ్యే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) తాలిబన్ల వశమైంది. తాలిబన్లు అడుగుపెట్టడంతో భీతిల్లిపోయిన విదేశీయులు, స్థానికులు ఏదో విధంగా ప్రాణాలు రక్షించుకునేందుకు ఎగబడుతున్న పరిస్థితి కన్పించింది. ముఖ్యంగా అమెరికా వైమానిక దళానికి చెందిన సీ 17 విమానంలో ప్రయాణించినవారి సంఖ్య చూస్తే నిర్ఘాంతపోకతప్పదు. రికార్డు స్థాయిలో ప్రయాణీకుల్ని ఆ విమానం ఆఫ్ఘన్ నుంచి అమెరికాకు తీసుకెళ్లింది. సీ 17 విమానంలో జనం కిక్కిరిసిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణీకులున్నట్టు అప్పట్లో అంచనా వేసినా..తరువాత మాత్రం అంతకంటే ఎక్కువమందే ప్రయాణించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఎయిర్ మొబిలిటీ కమాండ్ వెల్లడించింది. ఆ రోజు వచ్చిన విమానంలో ఏకంగా 823 మంది ప్రయాణించినట్టు తేలింది.ఇందులో 183 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
అంతమంది అసలు ఎలా ప్రయాణించారనేది అంతుబట్టకుండా ఉంది. చిన్నారులు పెద్దోళ్ల భుజాలపై, వీపుపై కూర్చుని ప్రయాణించారు. సీ 17 విమానంలో(US C 17 Flight) ఇంతమంది ప్రయాణించడం కొత్త రికార్డుగా తెలుస్తోంది. తాలిబన్లపై(Talibans)భయంతో ఏదో విధంగా దేశం నుంచి బయటపడాలనే ఆతృతలో ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా విమానంలో చోటు సంపాదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానంపైకి ఎక్కి కూర్చున్నవారు..విమానం టేకాఫ్ అవగానే పైనుంచి కిందకు పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని చూశాం.
Also read: తాలిబన్ల వికృత చేష్టలు: వేశ్యగృహాల్లో నోరు లేని మూగ జీవాలు.. వాటితోనే లైంగిక వాంఛ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook