Pfizer Vaccine Side Effect: కరోనా వ్యాక్సినేషన్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి సవాలు విసురుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ వ్యాక్సిన్ తీసుకుని ఓ మహిళ మరణించడం ఆందోళన రేపుతోంది.
కరోనా వైరస్(Coronavirus)మహమ్మారి న్యూజిలాండ్‌లో శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా సరే..అందులో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మరణించడం ఆందోళన రేపింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయింది. దేశంలో ఫైజర్ కారణంగా ఇది తొలి మరణమని న్యూజిలాండ్(Newzealand)వైద్య అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ కారణంగా ఉత్పన్నమైన మయోకార్టిటిస్ సమస్యతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాతే అనారోగ్యంతో మహిళ మరణించిందని కోవిడ్ భద్రతా పర్యవేక్షణ బోర్డు సమీక్ష అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌కు(Pfizer Vaccine)సంబంధించిన అరుదైన సైడ్ ఎఫెక్ట్ మయోకార్టిటిస్ అనేది గుండె కండరాల వాపు. ఇది రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందనల తీరులో మార్పులకు కారణమవుతోంది. కరోనా పూర్తిగా కట్టడైన ఆరు నెలల తరువాత న్యూజిలాండ్‌లో డెల్టా వేరియంట్ భారీగా వ్యాపిస్తోంది. డెల్టా వేరియంట్ నియంత్రణకు దేశవ్యాప్తంగా ఈ నెల ప్రారంభంలో లాక్డౌన్(Lockdown) ప్రకటించింది.
Also read: India Corona Update: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఉధృతి, ఆ ఒక్క రాష్ట్రంలోనే 70 శాతం కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook