తెలుగు భాష రానివాళ్లు సావిత్రి పాత్రలో నటించడమా..!?

ఎంతోమంది నుంచి సావిత్రికి సంబంధించిన సమాచారం సేకరించామని నాగ్ అశ్విన్ చెబుతుండగా, జమున ఇలా స్పందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Last Updated : Feb 19, 2018, 01:57 PM IST
తెలుగు భాష రానివాళ్లు సావిత్రి పాత్రలో నటించడమా..!?

తెలుగు భాషరాని వాళ్లు సావిత్రిగా నటించడం ఆశ్చర్యం వేస్తోందని అలనాటి సినీనటి జమున ఆక్షేపించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మహానటి' సినిమాపై జమున స్పందించారు.  

 "సావిత్రికి, నాకు మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం అక్కాచెల్లెళ్లుగా ఉండేవాళ్లం.. అలాగే పిలుచుకునే వాళ్లం. జెమినీ గణేశన్ తో వివాహ సమయంలో సావిత్రిని ఎవరు ఎంతలా వారించినా వినిపించుకోలేదు. ఆమె అనారోగ్యం చెందిన సమయంలో, అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  అమెరికా పంపించడానికి ఎంతగానో ప్రయత్నించాను. సావిత్రి స్వభావం.. ఆనాటి సంఘటనల గురించి బాగా తెలిసిన నాకు ఈ సినిమా గురించి చెప్పకపోవడం.. సావిత్రి గురించి అడగకపోవడం ఆశ్చర్యకరం. పైగా తెలుగు భాష తెలియనివాళ్లు సావిత్రి పాత్రను పోషిస్తుండటం విడ్డూరంగా ఉంది" అంటూ ఆమె ఆక్షేపించారు.

ఎంతోమంది నుంచి సావిత్రికి సంబంధించిన విషయాలు సేకరించామని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెబుతుండగా, జమున ఇలా స్పందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా 'మహానటి' సినిమా రూపొందుతోంది.

Trending News