India-Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ హస్తగతం చేసుకున్న తరువాత ఒక్కక్కటిగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత రాయబారి..తాలిబన్లతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇండియా పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసిన తాలిబన్లతో ఇండియా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్..తాలిబన్ ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్ మద్య జరిగిన చర్చలు విశేషంగా నిలిచాయి. దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తాలిబన్ల అభ్యర్ధన మేరకు ఈ సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ సమావేశంలో ఇండియా ప్రస్తావించిన సమస్యల్ని పరిష్కరిస్తామని తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. ఆప్ఘన్ నేలను..భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏ మాత్రం ఉపయోగించకూడదని భారత రాయబారి మిట్టల్..తాలిబన్లను కోరారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, తరలింపు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అదేవిధంగా ఆఫ్ఘన్ జాతీయులు, మైనార్టీలు, ఇండియాను సందర్శించాలనుకునేవారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చాయి. భారత్‌తో వాణిజ్య, ఆర్ధిక సంబంధాలు కొనసాగిస్తామని, తమ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని తాలిబన్లు(Talibans) వెల్లడించిన నేపధ్యంలో ఈ చర్చలు జరగడం విశేషం.
Also read: Talibans: ఇండియాతో మాకు ఏ విధమైన ముప్పు ఉండదు : తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook