Dengue and Platelets: డెంగ్యూ ఉంది జాగ్రత్త, ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి, ఏం చేస్తే పెరుగుతుంది

Dengue and Platelets: ఓ వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే..మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్‌లెట్స్ కౌంట్స్ ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2021, 10:37 AM IST
  • డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలున్నాయి..జాగ్రత్త
  • ప్లేట్‌లెట్లు ఎంత ఉండాలి, ఎందుకు అవసరం
  • ప్లేట్‌లెట్ కౌంట్ ఎలా పెరుగుతుంది
 Dengue and Platelets: డెంగ్యూ ఉంది జాగ్రత్త, ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి, ఏం చేస్తే పెరుగుతుంది

Dengue and Platelets: ఓ వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే..మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్‌లెట్స్ కౌంట్స్ ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.

గత కొద్దిరోజులుగా డెంగ్యూ వ్యాధి (Dengue)విస్తరణ ఎక్కువవుతోంది. డెంగ్యూ వచ్చిందంటే చాలు ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. డెంగ్యూ కాకుండా ఇతరత్రా వ్యాధుల్లో కూడా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతుంటుంది. అందుకే ప్లేట్‌లెట్ కౌంట్ కీలక భూమిక పోషిస్తుంటుంది. (How to increase platelet count)

అప్లాస్టిక్ అనీమియా, లుకేమియా, లింఫోమా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్(Viral Infections) వచ్చినప్పుడు తెల్ల రక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది. డెంగ్యూలో అయితే గంట గంటకూ  కౌంట్ పడిపోతుంటుంది. వెంటనే ప్లేట్‌లెట్ కౌంట్(Platelet Count) తగ్గినప్పుడు రోగికి రక్తస్రావం లేదా అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశముంటుంది. అటువంటప్పుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3- 4 లక్షల వరకూ లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 80 వేల వరకూ పడిపోయినా ఎటువంటి నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు.రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. వెంటనే అదే గ్రూప్ బ్లడ్‌గ్రూప్‌కు సంబంధించి ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ బ్యాంకులో దాతలిచ్చిన రక్తంలో ఉండే మూడు అంశాల్ని వేరుచేస్తారు. ఎర్రరక్తకణాలు, ప్లాస్మా,ప్లేట్‌లెట్స్‌ను విడదీసి..వేర్వేరుగా ప్యాక్ చేస్తారు.ప్లేట్‌లెట్స్ అవసరమైనవారికి ఎక్కిస్తుంటారు. 

దీంతో పాటు సహజ పద్దతిలో సర్వామోదమైన మరో పద్థతి ఉంది. తక్షణం శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచుతుంది. బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం(Papaya leaves Count). ఇది చాలా సులభం. లేత ఆకుల్నించి ఎప్పటికప్పుడు కొద్దిగా రసాన్ని సేకరించాలి. 5 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ వరకూ ప్రతిరోజూ ఉదయం , రాత్రి తీసుకుంటే చాలా వేగంగా ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇతర మందులు వాడుతూ కూడా ఈ రసం తీసుకోవచ్చు. చాలామంది వైద్యులు కూడా ప్రస్తుతం ఇదే సూచిస్తున్నారు.ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరగడానికి అద్భుతమైన హోమ్ రెమిడీ(Home Remedy for Dengue) ఇది.

Also read: Viper Poison: కరోనాకు మందు..ఆ ప్రమాదకర పాము విషమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News