Ram Charan: వైరల్‌గా రామ్ చరణ్‌ వాచ్‌..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ram Charan: సెలబ్రెటీలు ఏది ధరించిన వైరల్ గా మారుతుంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధరించిన వాచ్ పై అందరి కన్ను పడింది. దీంతో ఆ వాచ్ పై ఇప్పడు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే..మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2021, 08:32 PM IST
  • వైరల్ గా రామ్ చరణ్ వాచ్
  • వాచ్ రేట్..రూ.1,02 కోట్లు
  • శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్
Ram Charan: వైరల్‌గా రామ్ చరణ్‌ వాచ్‌..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ram Charan : సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాచ్‌ల దగ్గర్నుంచి వేసుకునే బ్యాగులు, చెప్పుల వరకు దాదాపు అన్ని కాస్ట్‌లీగానే ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ramcharan) శంకర్‌(Shankar) దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రామ్‌చరణ్‌ ధరించిన వాచీ(Ramcharan Watch)పైనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది.రామ్‌చరణ్‌ ధరించిన వాచ్‌ మోడల్‌ ఏంటి? దాని ధరెంత అని సెర్చ్‌ చేయగా అది 'రిచర్డ్ మిల్లె RM 61-01 యోహన్ బ్లేక్ మోడల్‌' అని తెలిసింది.

ఒలింపిక్స్‌లో 100,200 మీటర్లలో ఫాస్టెస్ట్ రన్నర్‌గా ప్రపంచ రికార్డ్‌ సాధించిన యోహన్ బ్లేక్ కోసం 'రిచర్డ్ మిల్లే' కంపెనీవారు ఈ వాచ్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. అప్పటి నుంచి ఈ వాచ్‌కి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు యల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ రావడం ఈ వాచ్ కి మరింత గ్రాండ్‌ లుక్‌ను తీసుకువచ్చింది. వందశాతం వాటర్‌ రెసిప్టెన్సీ ఉన్న ఈ వాచ్‌ ధర 124500 యూరోలు. అంటే ఇండియన్‌ కరెన్సీలో అక్షరాలా రూ.1,02 కోట్లు అనమాట.

Also Read: Ram Charan's RC15 launch: రామ్‌చరణ్‌ ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన మెగాస్టార్ అతిథులుగా రాజ‌మౌళి,ర‌ణ్‌వీర్ సింగ్

2018 డిసెంబరు, 20న రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లికి హాజరైన ఎన్టీఆర్(Jr NTR) చేతికి ఉన్న వాచ్ అప్పట్లో వైరల్‌గా మారింది. దాని గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. అది కూడా రిచర్డ్ మిల్లే మెక్‌లారెన్ కంపెనీకి చెందిన వాచ్ కావడం గమనార్హం. ఈ వాచ్‌ను ఎఫ్-1 రేస్‌లో పాల్గొనే క్రీడాకారులు ఎక్కువగా ధరిస్తారట. ఆ వాచ్ విలువ రూ.2.27 కోట్లు ఉన్నట్లు ఆన్‌లైన్‌ సెర్చ్‌లో తేలింది. ఈ వాచ్‌లో టైటానియంతో తయారుచేసిన డయల్ ఉంటుంది. రబ్బర్ స్ట్రాప్ కలిగిన ఈ వాచ్‌ కేస్‌ను కార్బన్ టీపీటీ మిశ్రమంతో రూపొందించారు. వివిధ దేశాల కాలాన్ని ఈ వాచ్‌లో ఒకేసారి చూడొచ్చట. మొత్తానికి RRR స్టార్లు ఇద్దరు తమ ఖరీదైన వాచ్‌లతో అబ్బో అనిపిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News