Ganesh idol immersion: హుస్సేన్‌సాగర్‌లో PoP idols నిమజ్జనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

TS Govt to File Petition on Vinayaka Nimajjanam: దీంతో వేలాది విగ్రహాల గురించి, భక్తుల మనోభావాలపై అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను మొత్తం సుప్రీంకోర్టుకు వివరించాలని, నిమజ్జనానికి అనుమతి కోరాలని సమావేశంలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 10:34 AM IST
  • ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దు
  • తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
Ganesh idol immersion: హుస్సేన్‌సాగర్‌లో PoP idols నిమజ్జనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana govt to file petition in Supreme Court : హైదరాబాద్‌: ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది తెలంగాణ  ప్రభుత్వం. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR)నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే నిమజ్జనానికి సంబంధించి ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా అందుకు హైకోర్టు (High Court)నిరాకరించింది.

Also Read : Elon Musk Effect: ఎలాన్ మస్క్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా,

సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని నిర్ణయం

దీంతో వేలాది విగ్రహాల గురించి, భక్తుల మనోభావాలపై అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు (supreme court) అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను మొత్తం సుప్రీంకోర్టుకు వివరించాలని, నిమజ్జనానికి (immersion) అనుమతి కోరాలని సమావేశంలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు (High Court) ఉత్తర్వులపై సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Also Read : SBI Pension Seva: సీనియర్ సిటిజన్ల కోసం కొత్తగా పెన్షన్ సేవల్ని ప్రారంభించిన ఎస్బీఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News