How to Conquer Insomnia : మనలో చాలా మంది రోజంతా ఆఫీసుపని, ఇంటిపనితో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి బాగా అలసిపోయినా కూడా పడుకుందామంటే నిద్ర రాదు. నిద్రలేమితో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే తీవ్ర అనారోగ్యాలు దరి చేరే ప్రమాదం ఉంది. రోజుకి ఆరేడు గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోతనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలున్నాయి.. అవి ఏమిటో ఒకసారి చూద్దామా.
బెడ్రూమ్‌లో (bedroom) బాగా వెలుతురు ఉండే లైట్లను (Lights) నిద్రపోయే ముందు ఆఫ్ చేసేయాలి. ఫోన్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్ల నుంచి వెలువడే కిరణాలు కంటిని అలసిపోయేలా చేస్తాయి. దీంతో నిద్ర దూరం అవుతుంది. అలాంటి వెలుతురు నిద్రను దరిచేర్చేటటువంటి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటకంగా ఉంటుంది.
బెడ్రూమ్‌లో లేత నీలి వర్ణం వెలుతురుండే బెడ్‌లైట్స్ (led lights) ఉండేలా చూసుకోండి. దీంతో మనసుకు కాస్త హాయిగా ఉంటుంది. ఒకవేళ మీకు బుక్స్ (Books) చదివే అలవాటు ఉంటే... పడుకునే ముందు ఇష్టమైన పుస్తకాన్ని చదవండి. అయితే పుస్తకం పేజీలపై వెలుతురుపడేలా లైట్ ఉంటే కంటికి ఎక్కువగా అలసట రాదు. ఈ విధానాన్ని అలవర్చుకుంటే నిద్రలేమి నుంచి బయటపడొచ్చు.
Also Read : SBI Dussehra Offer: ఎస్‌బీఐ దసరా పండుగ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇవే
అయితే రోజంతా పని చేసి అలిసిపోయిన శరీరం, మనసు కాస్త ఆహ్లాదంగా మారాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మంచి రిలీఫ్ వస్తుంది. దీంతో హాయిగా నిద్రపోవచ్చు. ఆ తర్వాత చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగితే మెదడు రిలాక్స్ అవుతుంది. అలాగే ఒత్తిడిని దూరం చేయడానికి రోజూ ప్రాణాయామం చేస్తే కూడా చాలా మంచిది.
నిద్ర (Sleep) శరీరంలోని జీవక్రియల్లో ఒక భాగం. రోజూ క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో నిద్రకు ఉపక్రమిస్తే శరీరం అందుకు అలవాటుపడుతుంది. రాత్రి సమయాల్లో తేలికగా అరిగే, తక్కువ ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. జీర్ణాశయంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. దీంతో శరీరం త్వరగా విశ్రాంతి దశలోకి వెళుతుంది. అలాగే ఉదయం త్వరగా మెలకువ వస్తుంది. ఆ ఉత్సాహం రోజంతా ఉంటుంది. ఇలాంటి చిన్నచిన్న టెక్నిక్స్ పాటిస్తే నిద్రలేమిని (Insomnia) జయించొచ్చు.
Also Read : Tesla Electric Car: టెస్లా ఎలక్ట్రిక్ కారు ఇండియా ఎంట్రీకు కొత్తగా మరో సమస్య
Insomnia: నిద్రలేమికి దూరంగా ఉండాలంటే ఇలా చేయండి మరి
మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు
బెడ్రూమ్‌లో బాగా వెలుతురు ఉండే లైట్లు వద్దు
అలాంటి వెలుతురు నిద్రను దరిచేర్చేటటువంటి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటకం