CM Jagan: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ(Department of Medical Health)లో నియామకాల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష( CM Jagan Review)నిర్వహించారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆసుపత్రుల నుంచి భోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ (recruitment)ప్రక్రియ ప్రారభించి, నవంబర్ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండవద్దని సీఎం ఆదేశించారు.
Also Read:Ys Jagan Review: రాష్ట్రంలో తగ్గిన మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఆసుపత్రుల్లో ఔషధాల కొరత లేదు: భాస్కర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల(Medicine) కొరత లేదని వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు. కొవిడ్ వల్ల ఐదారురెట్లు అధికంగా ఔషధాలు కొనుగోలు చేశామని సీఎంకు వివరించారు. ఈ-ఔషధి వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవని పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా ఔషధాలు సరఫరా చేస్తున్నామని వివరించారు.‘‘క్యాన్సర్ ఔషధాలు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పటివరకు 2వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మొత్తం డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయి. డెంగ్యూ జ్వరాలకు సరిపడినన్ని ఔషధాలు, టెస్ట్ కిట్లు ఉన్నాయి’’ అని వైద్యారోగ్యశాఖ కమిషనర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి