Google Services: రేపట్నించి గూగుల్, యూట్యూబ్ సేవలన్నీ బంద్, తక్షణం ఫోన్ మార్చుకోవల్సిందే

Google Services: రేపట్నించి లక్షలాది ఫోన్లలో జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటివేవీ పనిచేయవు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ఫోన్లు అప్‌గ్రేడ్ కాకపోతే రేపట్నించి ఇదే పరిస్థితి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2021, 11:54 AM IST
  • సెప్టెంబర్ 27 నుంచి ఆ ఫోన్లలో గూగుల్ సేవలు నిలిపివేత
  • ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ ఫోన్లలో గూగుల్ సేవల్ని నిలిపివేయనున్న సంస్థ
  • సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ లేదా ఫోన్ మార్చుకోవల్సిందే లేదంటే జీమెయిల్, యూట్యూబ్ పనిచేయవిక
Google Services: రేపట్నించి గూగుల్, యూట్యూబ్ సేవలన్నీ బంద్, తక్షణం ఫోన్ మార్చుకోవల్సిందే

Google Services: రేపట్నించి లక్షలాది ఫోన్లలో జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటివేవీ పనిచేయవు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ఫోన్లు అప్‌గ్రేడ్ కాకపోతే రేపట్నించి ఇదే పరిస్థితి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 27వ తేదీ అంటే రేపట్నించి లక్షలాది ఫోన్లలో ఆ సేవల్ని నిలిపివేసేందుకు గూగుల్(Google)నిర్ణయించింది. పాత స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ సంబంధిత అకౌంట్లు శాశ్వతంగా(Google to block Accounts) పనిచేయవిక. మీ గూగుల్ అక్కౌంట్లు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఫోన్లను అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్త మొబైల్‌కు మారిపోయి లాగిన్ కావడం చేయాల్సిందే. లేకపోతే జీ మెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలన్నీ నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి 2.3 వెర్షన్ డివైజ్‌లలో గూగుల్ యాప్స్‌లో లాగిన్ కాలేరు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎర్రర్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్(Android 2.3 Version)లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఫోన్లలో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. యూజర్ల భద్రత, డేటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో డివైజ్ తయారీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

అందుకే పాత స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నవారంతా తక్షణం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్(Software Upgrade)చేసుకోవల్సిందే లేదా ఫోన్ మార్చుకోవాలి. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్, ఐఫోన్లలో ఐవోఎస్ 15 నడుస్తోంది. 2010 నుంచి గూగుల్ ఒక్కొక్క వెర్షన్‌ను విడుదల చేస్తోంది. 2017లో ఆండ్రాయిడ్ 2.3 ఫోన్లకు గూగుల్ పే సేవలు నిలిచిపోయాయి. ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్ల జాబితా ఇలా ఉంది. Sony Xperia Advance, Lenovo k800, Sony Xperia Go, Vodafone Smart, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి ఈ పాత వెర్షన్‌తో మార్కెట్‌లో. 

Also read: Google Incognito: గూగుల్ ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ ఎంతవరకూ క్షేమకరం, కొత్త ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News