Ather Energy: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్ న్యూస్...ఏ స్కూటర్‌కైనా ఫ్రీ ఛార్జింగ్‌ అంటున్న 'అథర్‌'..

ఎలక్ట్రిక్‌ వాహనదారులకు 'అథర్‌ ఎన‌ర్జీ' గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచిత ఛార్జింగ్ సర్వీసును పొడిగిస్తున్నట్లు అథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా ప్రకటించారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2021, 03:53 PM IST
  • 'అథర్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బంపర్‌ ఆఫర్‌
  • ఏ స్కూటర్‌కైనా ఛార్జింగ్‌ ఫ్రీ
  • వెల్లడించిన సీఈవో తరుణ్ మెహతా
Ather Energy: ఎలక్ట్రిక్‌ వాహనదారులకు గుడ్ న్యూస్...ఏ స్కూటర్‌కైనా ఫ్రీ ఛార్జింగ్‌ అంటున్న 'అథర్‌'..

Ather Energy: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనదారులకు తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు 'అథర్ ఎనర్జీ' (Ather Energy)ముందుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచిత ఛార్జింగ్ సర్వీసును పొడిగిస్తున్నట్లు అథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా(Atharna Energy CEO Taruna Mehta) ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య ను 500పెచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.   

బెంగ‌ళూరు కేంద్రంగా అథర్‌ ఎనర్జీ 450 ఎక్స్‌, 450 ఎక్స్ ప్ల‌స్‌ ఎలక్ట్రికల్‌ స్కూటర్ల (ఈవీ) అమ్మకాల్ని ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై ఇస్తున్న సబ్సీడీ ఆధారంగా వెహికల్ ధరల్ని తగ్గిస్తుంది. పనిలో పనిగా అథర్‌ గ్రిడ్‌ పేరుతో అందిస్తున్న ఉచిత ఛార్జింగ్‌ సర్వీస్‌(Free Charging Service)ను ఈ ఏడాది డిసెంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు తరుణ మెహతా వెల్లడించారు.ఈ గ్రిడ్‌ లోకేషన్లలో అథర్‌ సంస్థతో పాటు ఇతర కంపెనీల ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉచితంగా ఛార్జింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అథర్‌ ప్రకటించింది.

Also read: Online Gold: కేవలం రూ.100 కే బంగారం.. ఎగబడుతున్న జనం

ఎలక్ట్రిక్‌ వాహనదారులు ఛార్జింగ్‌ పాయింట్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాహనదారుల అవసరాన్ని బట్టి ఛార్జింగ్‌ స్టేషన్ల(Charging Stations) ఏర్పాటకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అథర్‌ సీఈఓ తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న 24 ప్రధాన నగరాల్లో 200 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను నెలకొల్పినట్లు, 2022 మార్చి నాటికి ఆ సంఖ్యను 500 పెంచనున్నారు. ప్రతి నెల 45 కొత్త ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నట్లు అథర్‌ ఎనర్జీ సీఈఓ తరుణ మెహతా(Atharna Energy CEO Taruna Mehta) అన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News