IPL 2021 Points table today: ఐపిఎల్ 2021 పాయింట్స్ పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 50వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలవడంతో ఢిల్లీ జట్టు టాప్ ర్యాంకులోకి దూసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో 137 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (Delhi capitals) లక్ష్యఛేదనలో ఆద్యంతం తడబడింది. దీంతో మ్యాచ్ చివరి ఓవర్లో మరో మూడు బంతులు మిగిలి ఉన్నాయనేంత వరకు ఉత్కంఠ తప్పలేదు. అలా మరో రెండు బంతులు మిగిలి ఉన్నాయనగా విజయం సాధించి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 13 మ్యాచుల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించి 20 పాయింట్స్‌తో టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తర్వాతి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరు తర్వాతి స్థానంలో 12 పాయింట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Also read : Ziva Dhoni: మా నాన్న జట్టే గెలవాలి.. క్యూట్‌గా ప్రార్థిస్తున్న ధోని కూమార్తె..ఫోటో వైరల్
ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 10 పాయింట్స్‌తో 5వ స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టు 10 పాయింట్స్‌తో 6వ స్థానంలో, ముంబై ఇండియన్స్ జట్టు పది పాయింట్స్‌తో ఏడవ స్థానంలో నిలిచింది. చిట్టచివరన సన్‌రైజర్స్ హైదరాబాద్ 8వ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడగా అందులో 10 మ్యాచ్‌లు ఓడిపోయి కేవలం రెండు మ్యాచులు మాత్రమే విజయం సాధించింది.
IPL 2021 Orange Cap Holder - ఐపిఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్:
పంజాబ్ కింగ్స్ కెప్టేన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపిఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో కే.ఎల్.రాహుల్ మొత్తం 528 పరుగులు చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ 521 పరుగులతో (Ruturaj Gaikwad) రెండో స్థానంలో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Delhi capitals opener Shikhar Dhawan) 501 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also read : T20 World Cup 2021: టీమిండియాకు ఆ సత్తాలేదు.. ఈ సారి మాదే విజయం: అబ్దుల్ రజాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook