Apprentice Jobs Recruitment: ఇండియన్ రైల్వేస్ నుంచి నిరుద్యోగ విద్యార్ధులు, అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఈస్టర్న్ రైల్వేలో భారీగా అప్రెంటిస్ ఖాళీల్ని భర్తీ చేయనుంది. రైల్వే కాకుండా ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కూడా అప్రెంటిస్ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
నిరుద్యోగ విద్యార్ధులు, అభ్యర్ధుల కోసమే ఈ వార్త. అటు రైల్వే శాఖ ఇటు కేంద్ర ప్రభుత్వ(Central government)సంస్థలు భారీగా ఖాళీల్ని భర్తీ చేయనున్నాయి. రైల్వేలో అయితే పెద్ద సంఖ్యలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. కోల్‌కత్తాలోని ఈస్టర్న్ రైల్వే రిక్రూట్‌మెంట్(Eastern Railway)సెల్ వివిధ డివిజన్లు, వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల (Apprentice Posts)భర్తీకు దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 3 వేల 366 ఖాళీలున్నాయి. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, డిజిల్ మెకానిక్ విభాగాల్లో ఈ ఉద్యోగాలున్నాయి. ట్రేడ్‌ను బట్టి 8వ తరగతి, 50 శాతం మార్కులతో పదవ తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. వయస్సు 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి. పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://er.indianrailways.gov.in లో నవంబర్ 3వ తేదీలోగా దరఖాస్తు చేయాలి.
ఇక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) కర్ణాటకలోని వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్ విభాగాల్లో మొత్తం 75 ఖాళీలున్నాయి. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అక్టోబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ www.npcil.nic.in ని సందర్శించాలి.
ఇక ఇస్రో-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌కు(ISRO-IIRS) చెందిన వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు(Apprentice Posts) భర్తీ చేయనున్నారు. డెహ్రాడూన్‌లోని ఈ శాఖలో 12 అప్రెంటిస్ ఖాళీలున్నాయి. ఇందులో డిగ్రీ అప్రెంటిస్ 10 కాగా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 2 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్సెస్ వంటివాటిలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 వేలు మించకుండా ఉండాలి. ఎంపికైనవారికి స్టైపెండ్ గా 8 వేలు చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో జియో ఇన్ఫర్మేటిక్స్, లైబ్రరీ సైన్స్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. నెలకు స్టైపెండ్ 9 వేలు చెల్లిస్తారు. డిప్లొమా, ఇంజనీరింగ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అక్టోబర్ 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ www.iirs.gov.in ను సందర్శించాలి.
Also read: Lakhimpur Kheri Visit: రాహుల్, ప్రియాంకల లఖీంపూర్ ఖీరీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook