Taiwan: మొన్న హాంకాంగ్. రేపు తైవాన్. ఇది చైనా పరిస్థితి. తైవాన్ను విలీనం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చల ద్వారా కాకుంటే బలప్రయోగమైనా చేసి తీరాల్సిందేనని చైనా భావిస్తోంది. అసలేం జరుగుతోంది.
చైనా-తైవాన్ దేశాలది(China-Taiwan)దాదాపు వందేళ్లకు పైగా కొనసాగుతున్న వివాదం. 1911 తిరుగుబాటు నుంచి కొనసాగుతోంది. 1949 నుంచి తైవాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉంది. అటు బలప్రయోగంతోనైనా తైవాన్ను కలుపుకోవాలనేది చైనా ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. తైవాన్ను చైనాతో విలీనం చేసి తీరుతామని జీ జిన్‌పింగ్ మరోసారి స్పష్టం చేశారు. తైవాన్ విలీనం శాంతియుతంగా, ఇరు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. తైవాన్ అంశంలో బయటి దేశాల ప్రమేయం అవసరం లేదని పరోక్షంగా అమెరికా, జపాన్‌లకు హెచ్చరించారు. ఇటీవలికాలంలో తైవాన్ గగనతలంలో చైనా చాలాసార్లు వైమానిక చొరబాట్లు చేసింది.
అటు తైవాన్ నేతల్లో ఇదే భయం నెలకొంది. చైనా తమను బలవంతంగా ఆక్రమిస్తుందని తైవాన్(Taiwan) కలవరపడుతోంది. ఇటు అమెరికా మాత్రం తైవాన్‌కు అండగా ఉంటోంది. తైవాన్ ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తైవాన్ సార్వభౌమదేశంగా భావిస్తుంటే..చైనా మాత్రం తమ ఆధీనంలోని ప్రాంతంగా చెబుతోంది. చైనాతో తైవాన్ విలీనానికి తైవాన్ స్వాతంత్య్ర దళాలే అతిపెద్ద అడ్డంకిగా చైనా చెబుతోంది. అదే సమయంలో తైవాన్ ఒప్పందాన్ని గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden)తెలిపారు. హాంకాంగ్‌లా వన్ కంట్రీ , టూ సిస్టమ్స్ విధానంతో తైవాన్‌తో ఒప్పందం చేసుకోవాలని చైనా ఆలోచిస్తోంది.
Also read: Corona Twindemic Alert: ప్రపంచానికి ఇక కరోనా ట్విండెమిక్ ముప్పు వెంటాడనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook