Petrol prices, diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. Fuel rates today

Petrol, diesel prices today in Telangana and AP: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం వరుసగా ఏడో రోజు కూడా ఇంధనం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు ధర పెరగ్గా, డీజిల్‌పై 35 పైసలు ధర పెరిగింది.

Written by - Pavan | Last Updated : Oct 11, 2021, 10:50 AM IST
  • వరుసగా ఏడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol prices and diesel prices).
  • వాహనదారులు, సామాన్యులపై పెరుగుతున్న ఆర్థిక భారం.
  • పెరుగుతున్న ధరలపై (Fuel price hiked) స్పందించడానికి నిరాకరించిన కేంద్ర మంత్రి
Petrol prices, diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. Fuel rates today

Petrol, diesel prices today in Telangana and AP: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం వరుసగా ఏడో రోజు కూడా ఇంధనం ధరలు మళ్లీ పెరిగాయి. నేడు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు ధర పెరగ్గా, డీజిల్‌పై 35 పైసలు ధర పెరిగింది. నేటి పెంపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇవాళ ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.104.44 మార్క్ తాకగా, లీటర్ డీజిల్‌ ధర రూ.93.17 కి చేరింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.110.41 కి చేరగా, లీటర్ డీజిల్‌ ధర రూ.101.03కి పెరిగింది. 

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు పెరగగా, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.108.64కు చేరగా లీటర్ డీజిల్‌ ధర రూ.101.65 కు (Fuel prices in Hyderabad) పెరిగింది. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 24 పైసల మేర పెరిగి రూ 110.63 కు చేరగా లీటర్ డీజిల్ ధర 31 పైసల మేర పెరిగి రూ. 103.05 మార్క్ (Fuel prices in Vijayawada) తాకింది. 

Also read : Edible Oil Prices: దేశీయంగా తగ్గిన వంట నూనె ధరలు, కారణమేంటంటే

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాల్యూ యాడెడ్ టాక్స్ ఆధారంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసం ఉంటుందనే విషయం తెలిసిందే. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు, ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్స్ ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను (Fuel rates) ప్రభుత్వరంగ ఇంధన సంస్థలు సవరిస్తున్నాయి.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై (Petrol prices, Diesel prices) ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇంధనం ధరలపై సుంకం తగ్గించి వాహనదారులపై, సామాన్యులపై పడుతున్న అదనం భారం నుంచి ఉపశమనం కలిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. శనివారం ఢిల్లీలో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో పెట్రోలియం శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పురిని (Oil Minister Hardeep Singh Puri) ఇదే విషయంపై ప్రశ్నించగా.. స్పందించడానికి ఆయన నిరాకరించారు.

Also read : Mahindra XUV700: 57 నిమిషాల్లో 25,000 బుకింగ్‌లు..మహీంద్రా ఎక్స్​యూవీ 700 క్రేజ్ మామూలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News