Asaduddin Owaisi Sensational Comments in Milad Un Nabi Meeting: హైదరాబద్ లో జరుగుతున్న మిలాద్-ఉన్-నబీ సభలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించటం, ఇండో-పాక్ మ్యాచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొదటగా మోదీని విమర్శిస్తూ.. "మన దేశ ప్రధాన మంత్రి రెండు విషయాల గురించి ఎపుడు మాట్లాడారు..
1) పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల గురించి
2) భారత్ భూభాగంలో చైనా తిష్ట వేయటం గురించి..ఎందుకంటే చైనా గురించి మాట్లాడాలంటే ప్రధాని మోదీకి భయం" అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | PM Modi never speaks on 2 things -- rise in petrol and diesel prices & China sitting in our territory in Ladakh. PM is afraid of speaking on China. Our 9 soldiers died (in J&K) & on Oct 24 India-Pakistan T20 match will happen: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/Q0AabFZ0BU
— ANI (@ANI) October 19, 2021
Also Read: India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా
మరో విషయం ఏమిటంటే.. "జమ్మూ కాశ్మీరులో మన సైనికులు 9 మంది మరణించారు. పాకిస్తాన్ అండదండలతో ఉగ్రవాదులు మన దేశంపై చెలరేగిపోతుంటే.. మరోవైపు భారత్ -పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతుందని అయన పేర్కొన్నారు. కాశ్మీరులో మన సైనికులు చనిపోతుంటే..మీరు టీ 20 ఆడతారా..?? పాకిస్తాన్ జమ్మూ- కాశ్మీర్ ప్రజలతో రోజు టీ-20 మ్యాచ్ ఆడుతుందని" ధ్వజమెత్తారు.
అంతేకాకుండా, "మగాళ్లకో న్యాయం..? ఆడవాళ్లకి మరో న్యాయమా..? ఒక ముస్లిం అబ్బాయి ఎవరితో అయిన తిరోగొచ్చు.. కానీ ఒక ముస్లిం అమ్మాయి తిరోగొద్దు.. దేశం, ప్రపంచ, టెక్నాలజీ మారింది.. ఇపుడు మనం ఉన్నది 1969 కాదు... 2021.. కాలానికి తగినట్టు మనం మారక తప్పదని" పేర్కొన్నారు.
#Hyderabad MP & @aimim_national Chief @asadowaisi to #LoveBirds - जब प्यार किया तो डरना क्या ? pic.twitter.com/HMvChoxsJH
— Pramod Chaturvedi (ANI) 🇮🇳 (@PramodChturvedi) October 19, 2021
Also Read: Viral Video: అనుమానం పెనుభూతం.. భర్తపై అనుమానంతో జిమ్‌లో మహిళను ఇరక్కొట్టిన భార్య
"బుర్కా వేసుకున్న అమ్మాయి.. ముస్లిం అబ్బాయితో తిరిగితే ఏ సమస్యలేదు.. కానీ అదే ముస్లిం అమ్మాయి వేరే వాళ్లతో తిరిగితే.. నడి రోడ్డుపై దాడి చేస్తారా..?" అంటూ ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook