Kishan Reddy : రామప్ప పర్యాటకుల కోసం వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి ‌‌- కిషన్‌రెడ్డి

Kishan Reddy to visited Ramappa Temple : ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే రామప్ప ఆలయంపై దృష్టిపెట్టానని చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 09:11 AM IST
  • రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ
  • వరంగల్‌లో విమానాశ్రయం ఉండాలన్న కిషన్‌రెడ్డి
 Kishan Reddy : రామప్ప పర్యాటకుల కోసం వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి ‌‌- కిషన్‌రెడ్డి

Union Minister for Culture Tourism and Development of North Eastern Region G Kishan Reddy Visited the Ramappa Temple: రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. తాజాగా ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది కాకతీయ కట్టడం రామప్ప ఆలయం ( Ramappa Temple). ఈ నేపథ్యంలో ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్నా.. గుర్తింపు పొందలేకపోయాయని కిషన్‌రెడ్డి తెలిపారు. తాను కేంద్రమంత్రిగా (Union Minister) బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే రామప్ప ఆలయంపై దృష్టిపెట్టానని చెప్పారు. 

Also Read : Epsilon Variant Found in Pakistan:పాకిస్తాన్‌లో ప్రమాద ఘంటికలు..7 కొత్త మ్యూటేష‌న్లు

అయితే రామప్పకు వచ్చే ప్రపంచ పర్యాటకుల కోసం వరంగల్‌లో (Warangal) విమానాశ్రయం ఉండాలన్నారు కిషన్‌రెడ్డి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉడాన్‌ పథకం (UDAN Scheme) కింద విమానాశ్రయానికి రాయితీ ఇస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ఇక రామప్పలో ఆర్కిటెక్చర్‌ కళాశాల (College of Architecture) ఏర్పాటు చేయాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. మేడారం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. అలాగే అన్ని ప్రాంతాల నుంచి ములుగుకు బస్‌ సౌకర్యం కల్పించాలన్నారు. మేడారం (Medaram) జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని ఆమె కోరారు. ఇక రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపుతో సీఎం కేసీఆర్ (KCR) కల సాకారమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 

Also Read : Sammathame movie First Glimpse : ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం ఫేమ్ కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లిమ్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News