India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021) వేదికగా మరో రెండు రోజుల్లో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్లుగా వన్డే, టీ20 వరల్డ్ కప్‌లలో ఏదైనా పాకిస్తాన్‌పై టీమ్ఇండియా ఎక్కువ సార్లు ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబరు 24) జరగనున్న మ్యాచ్‌లో మరోసారి పాక్ జట్టుపై ఇండియా జట్టు విజయం సాధిస్తుందా? అని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలుపొందాలని పట్టుదలతో ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి.
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో భారత యువ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul Batting Average), రిషభ్ పంత్‌లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, పాకిస్తాన్ కోచ్ మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు నుంచి పాకిస్తాన్ జట్టుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపాడు.
"నాకు తెలిసి టీమ్ఇండియా ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నుంచి పాకిస్తాన్ టీమ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్ నుంచి కూడా పాక్ అవరోధాలు ఎదుర్కొవచ్చు. పంత్ తనదైన శైలిలో నవ్వుతూ ఆడుతూనే.. ప్రత్యర్థి గెలుపు ఆశలను నాశనం చేస్తాడు" అని పాక్ ప్రధాన కోచ్ మాథ్యూ హెడెన్ అన్నాడు.
పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై మాథ్యూ హెడెన్ (Matthew Hayden News) ప్రశంసలు కురిపించాడు. అటు బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొంటూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు. అక్టోబరు 24న భారత్, పాక్ (India Vs Pakistan Match) మధ్య హై వోల్టెజీ మ్యాచ్ జరగనుంది.
హిస్టరీ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు ఏడూ సార్లు ప్రపంచకప్‌లో తలపడ్డాయి.. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్ లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ జట్టు వ్యూహాలు రచిస్తుంటే.. భారత్ మాత్రం ఈ సారి కూడా ఆధిపత్యం మాదే అంటూ దీమాగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook