Baba Ramdev: క్రికెట్, టెర్రర్ ఒకేసారి ఆడటం కష్టమంటున్న బాబా రాందేవ్

Baba Ramdev: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల పోరుకై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటే..బాబా రాందేవ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2021, 03:32 PM IST
  • టీ20 ప్రపంచకప్‌లో ఇంియా పాకిస్తాన్ మ్యాచ్‌‌పై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
  • ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశ ధర్మానికి, ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్య
  • క్రికెట్, టెర్రర్ రెండు గేమ్‌లు ఒకేసారి ఆడలేమంటున్న రాందేవ్ బాబా
 Baba Ramdev: క్రికెట్, టెర్రర్ ఒకేసారి ఆడటం కష్టమంటున్న బాబా రాందేవ్

Baba Ramdev: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల పోరుకై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటే..బాబా రాందేవ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ICC T20 World Cup 2021లో అందరూ ఎదురు చూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్(India-Pakistan Match)ఇవాళ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల మధ్య పోరు కావడంతో అత్యంత ఆసక్తి నెలకొంది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. మరోవైపు టాస్ నుంచి ప్రతి అంశం వరకూ ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్ ఊపందుకుంటోంది. ఇవాళ్టి మ్యాచ్‌పై దాదాపు 2 వేలకోట్ల వరకూ బెట్టింగ్ జరగవచ్చని అంచనా. ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని ఇండియా..మరోసారి పాకిస్తాన్‌ను ఓడించేందుకు సిద్ధమౌతోంది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup)మ్యాచ్‌లో ఆరోసారి గెలిచేందుకు ఇండియా సంసిద్ధమౌతుంటే..ఈసారైనా గెలవాలనే నిశ్చయంతో పాకిస్తాన్ ఉంది. తొలి మ్యాచ్‌ను ప్రత్యర్ధి దేశంపై గెలిచి..స్ఫూర్తి నింపాలనే ఆలోచనలో కోహ్లీ సేన ఉంది. 

మరి కాస్సేపట్లే మ్యాచ్ ప్రారంభం కావల్సి ఉండగా..యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలు, రాజ ధర్మానికి విరుద్ధమని బాబా రాందేవ్ చెప్పారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడటం రాజ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. దేశ ప్రయోజనాలకు ఇది మంచిది కాదన్నారు. క్రికెట్, టెర్రర్ రెండు గేమ్‌లు ఒకేసారి ఆడలేమని బాబా వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీ(BJP) నేత కూడా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. 

Also read: Shoaib Akhtar Comments: భారత ఆటగాళ్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి.. విరాట్ ఇన్‌స్టాకు దూరంగా ఉండాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News