Henley Passport index 2021: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు(Powerful Passports)గా జపాన్, సింగపూర్ దేశాల పాస్‌పోర్ట్‌లు నిలిచాయి. ఈ దేశాల వీసా ఫ్రీ స్కోర్ 192 అంటే… జపాన్(Japan), సింగపూర్(Singapore) దేశాల ప్రజలు కేవలం పాస్‌పోర్ట్‌తో ఎలాంటి వీసా అవసరం లేకుండా ప్రపంచంలోని 192 దేశాలు తిరిగిరావచ్చు.
హెన్లీ అండ్ పార్ట్నర్స్ గ్లోబల్ సంస్థ(Henley and Partners Passport Index 2021) ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్’ పేరుతో తాజాగా ఓ జాబితా(List)ను విడుదల చేసింది. 58 వీసా రహిత స్కోరుతో భారత్(India) ఈ లిస్టులో 90వ స్థానంలో ఉంది. అంటే మన భారతదేశ పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తులు వీసా(Visa) లేకున్నా 58 దేశాలు చుట్టి రావచ్చు. గతేడాది ఈ జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఆరుస్థానాలు దిగజారి 90వ స్థానంతో సరిపెట్టుకుంది.
Also Read: UN Formation Day: ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం, విశేషాలివే
హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే ఓ గ్లోబల్ సంస్థ ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్’ పేరుతో ఏటా ఓ జాబితాను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ రీసెర్చ్ గ్రూప్ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(IATA) నుంచి సేకరించిన ప్రత్యేక సమాచారంతో ఈ జాబితాను విడుదల చేస్తోంది. కరోనా మహమ్మరి(Coronavirus) తగ్గి వివిధ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగిస్తున్న సమయంలో తాజాగా ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్- 2021’ను రూపొందించింది. జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకోగా…ఆఫ్ఘనిస్తాన్, సిరియా, పాకిస్తాన్, యెమెన్ దేశాలు చివరి స్థానంలో నిలిచాయి.
టాప్-10 పాస్‌పోర్టులివే..
1. జపాన్, సింగపూర్ – వీసా ఫ్రీ స్కోర్: 192
2. జర్మనీ, దక్షిణ కొరియా – వీసా ఫ్రీ స్కోర్:190
3.ఫిన్లాండ్ ,ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ – వీసా ఫ్రీ స్కోర్:189
4. ఆస్ట్రియా, డెన్మార్క్- వీసా ఫ్రీ స్కోర్:188
5.ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్- వీసా ఫ్రీ స్కోర్:187
6.బెల్జియం, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్- వీసా ఫ్రీ స్కోర్:186
7. చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా, నార్వే, ఇంగ్లండ్, అమెరికా – వీసా ఫ్రీ స్కోర్:185
8.ఆస్ట్రేలియా, కెనడా – వీసా ఫ్రీ స్కోర్:184
9. హంగేరీ – వీసా ఫ్రీ స్కోర్: 183
10. లిథువేనియా, పోలాండ్, స్లోవేకియా- వీసా ఫ్రీ స్కోర్: 182
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook