/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

David Warner IPL Auction: వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో (IPL Auction 2022) తాను పాల్గొంటానని అంటున్నాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner IPL 2022). ఐపీఎల్ లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ (Warner SRH News) తరఫున ఆడిన డేవిడ్ వార్నర్.. కెప్టెన్ గా 2016లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. అలాంటి బ్యాటర్ ప్రస్తుత సీజన్‌లో ఫామ్‌లేమితో ఇబ్బంది పడ్డాడు. ఈ ఏడాది రెండు దశల్లో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లోనూ (David Warner IPL 2021 News) విఫలమయ్యాడు. దీంతో యూఏఈ ఎడిషన్‌లో (IPL 2021 in UAE) కెప్టెన్సీతోపాటు జట్టులోనూ స్థానం గల్లంతైంది. వార్నర్‌ స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినా సన్‌రైజర్స్ తలరాత మాత్రం మారలేదు. సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతో ముగించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ ఉంటాడా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉండేది.

వార్నర్‌ను హైదరాబాద్‌ జట్టు రిటెయిన్ చేసుకుంటుందా? లేదా అనేదీ సందేహమే. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌.. వచ్చే ఏడాది జరగనున్న వేలంలో (David Warner IPL Auction) తాను పాల్గొంటానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ తనను అట్టిపెట్టుకుంటుందని మాత్రం తాను అనుకోవడం లేదని వార్నర్ పేర్కొన్నాడు. అయితే దీనిపై సన్‌రైజర్స్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే సన్ రైజర్స్ తుది జట్టులో తనకు చోటు లభించకపోవడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు.

“ఆ నిర్ణయం మింగుపడని చేదు గుళికలాంటిది. అయితే నన్ను తప్పించడానికి చెప్పిన లాజిక్‌ నవ్వు తెప్పించింది. ఇద్దరు యువ ఆటగాళ్లు నా కంటే మెరుగ్గా ఆడారని.. నేను గేమ్ ఆడుతున్నప్పుడు సరైన దృక్పథంతో ఆడలేదని వారిని తీసుకున్నట్లు చెప్పారు. ఇక వచ్చే సీజన్‌ ఐపీఎల్‌ విషయానికొస్తే.. నన్ను సన్‌రైజర్స్‌ తమ వద్దే ఉంచుకుంటుందని అనుకోవడం లేదు. వచ్చే వేలంలో నా పేరును ఉంచుతా. ఇటీవల ఐపీఎల్ పరిణామాల నేపథ్యంలో సన్‌రైజర్స్ నన్ను రిటెయిన్ చేయడం కష్టమే. అందుకే కొత్త ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం జరగనున్న మెగా ఆక్షన్‌ (IPL 2022 Mega Auction Date) డిసెంబర్‌లోగానీ, వచ్చే ఏడాది జనవరిలో గానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI IPL Auction 2022) నిర్వహించే అవకాశం ఉంది.

Also Read: T20 World Cup: తొలి ఓవర్ 1-0-2-3.. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న ఫ్యాన్స్

Also Read: Khel Ratna Award: నీరజ్, మిథాలీ సహా 11 మందికి ఖేల్ రత్న..ధావన్‌కు అర్జున అవార్డు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IPL 2022: David Warner confirms he will put his name in the mega auction
News Source: 
Home Title: 

David Warner IPL Auction: 'సన్ రైజర్స్ హైదరాబాద్ నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే'

David Warner IPL Auction: ‘సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే‘
Caption: 
zee media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు
  • వచ్చే సీజన్ కోసం ఆ టీమ్ తనను రిటైన్ చేసుకోదని వెల్లడి
  • అందుకే మెగా వేలంలో పాల్గొంటానని చెప్పిన వార్నర్
Mobile Title: 
David Warner IPL Auction: 'సన్ రైజర్స్ హైదరాబాద్ నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే'
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, October 29, 2021 - 10:26
Request Count: 
95
Is Breaking News: 
No