T20 World Cup 2021: సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైంది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరే మార్గాల్ని కఠినతరం చేసుకుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లలో ఎందుకు ఓడిపోయామో కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు. అదేంటో పరిశీలిద్దాం.
T20 World Cup 2021లో టీమ్ ఇండియా ఆశలు సన్నగిల్లుతున్నాయి. సెమీస్‌కు చేరడం దాదాపుగా కష్టంగా మారిన పరిస్థితి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో, రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిన పరిస్థితి. సెమీస్‌కు చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో కూడా ఓటమి పాలైంది. ఫలితంగా సెమీఫైనల్స్ ఆశలు(Semi final Chances) దాదాపుగా నీరుగార్చుకుంది. ఇక మిగిలింది ఇండియాకు మిగిలిన జట్ల జయాపజయాలపై ఆధారపడి ఎదురు చూడటమే. న్యూజిలాండ్‌తో(NewZealand) జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 14.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఓపెనర్లుగా బరిలో దిగిన కేఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషన్ 4 పరుగులకే వెలుదిరిగారు. ఇక రోహిత్ శర్మ 14 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.కెప్టెన్ విరాట్ కోహ్లి 9 పరుగులకే అవుటై నిరాశ మిగిల్చాడు. ఇక ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో జడేజా ఒక్కడే 26 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. అటు పాకిస్తాన్,ఇటు న్యూజిలాండ్ మ్యాచ్‌లలో ఎందుకు ఓడిపోయామో వివరించాడు.
బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయామని కెప్టెన్ విరాట్ కోహ్లీ((Virat Kohli)విచారం వ్యక్తం చేశాడు. మైదానంలో అడుగుపెట్టినపుడు న్యూజిలాండ్ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే వాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారని కోహ్లీ చెప్పాడు. అయితే తమ పరిస్థితి అలా లేదని... అవకాశం దొరికిందనుకున్న ప్రతిసారీ వికెట్ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. షాట్ ఆడదామా లేదా అన్న సందిగ్దంలో పడి భారీ మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇండియా తరఫున ఆడుతున్నపుడు భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయని.. ఎంతో మంది తమను చూస్తుంటారని వివరించాడు. చాలా మంది తమకోసం మైదానానికి కూడా వస్తారని.. ఈ అంచనాలకు అనుగుణంగా ఇండియాకు ఆడుతున్న ప్రతీ ఆటగాడు తనను తాను మలచుకోవల్సి ఉంటుందని విరాట్ స్పష్టం చేశాడు. కానీ కీలకమైన రెండు మ్యాచ్‌లలో తామలా చేయలేకపోయామని విరాట్ కోహ్లీ బాధపడ్డాడు. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. అయితే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఆశావాదంతో ఉండాలన్నాడు. ఒత్తిడిని జయించి.. ముందుకు వెళ్లి.. ఈ టోర్నమెంట్‌లో ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉందని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని అధిగమించలేక ప్రత్యర్థి జట్టు ముందు తలొంచాల్సి వచ్చిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇండియా ఇంకా స్కాట్లండ్, నమీబియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో ఆడాల్సి ఉంది.
Also read: T20 World Cup 2021: అది జరిగితే..టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి