Abhinandan Varthaman gets promoted: పాకిస్థాన్ సైన్యాన్ని ఎదిరించి.. అశేష జనభారతం అభిమానాన్ని సంపాదించుకున్న అభినందన్ వర్ధమాన్‌కు పదోన్నతి లభించింది.
వింగ్ కమాండర్‌గా ఉన్న వర్దమాన్ను (Wing Commander Abhinandan Varthaman) గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక దళంలో కల్నల్‌తో సమానమైన ర్యాంకే.. ఐఏఎఫ్‌లో గ్రూప్ కెప్టెన్.
2019లో అభినందన్‌ను వీర్ చక్ర అవార్డుతో (Veer Chakra to Abhinandan Varthaman) సత్కరించింది భారత ప్రభుత్వం.
Also read: Covaxin emergency use : కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్
అభినందన్ వర్ధమాన్ గురించి..
2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌లో (Balakot Attacks) ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత మరుసటి రోజు పాకిస్థాన్ సైన్యం ప్రతికార దాడికి యత్నించింది. ఇందులో భాగంగా ఎఫ్-16 విమానాలతో భారత్‌పై దాడి చేయాలని ప్రయత్నించింది. ఇది గమనించిన.. భారత వైమానిక కమాండర్ అభినందన్ మిగ్-21 విమానంతో (Mig-21 Aircrofts) దానిని వెంటాడి నేలకూల్చారు.
Also raad: Aadhaar Card: ఆధార్ చట్టం ఉల్లంఘిస్తే ఇక భారీ జరిమానా తప్పదు..ఎంతో తెలుసా
అయితే ఈ ప్రయత్నంలో అభినందన్ వర్ధమాన్ విమానం కూడా.. కూలిపోయింది. ఈ ఘటనలో అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా తప్పించుకున్నప్పటికీ.. పాకిస్థాన్ భూభాగంలో చిక్కుకున్నారు. దీనితో ఆయన్ను పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకుని చిత్ర హింసలు పెట్టింది. అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో 59 గంటల తర్వాత పాక్ ఆర్మీ అభినందన్‌ను అమృత్‌సర్‌కి సమీపంలోని వాఘా బార్డర్ వద్ద ఇండియన్ ఆర్మీకి అప్పగించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అభినంధన్కు అవసరమైన వైద్య పరీక్షలు చేసి.. కొన్ని రోజులు విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి ఆయన తన విధుల్లోకి చేరారు.
Also read: Bus Fall into Ravine: పండుగ రోజు విషాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 22 మంది మృతి
Also read: Nitin Gadkari: తాను పెద్ద పర్యావరణవేత్తనన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook