Faizabad Junction New Name: ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జంక్షన్ (Faizabad Junction) రైల్వే స్టేషన్ పేరును మార్చుతూ గతంలో ఆ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్‌ను ఇక అధికారికంగా అయోధ్య కంటోన్మెంట్ (Ayodhya Cantt)గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీదున్న పాత బోర్డులను అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చారు. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు గతంలో అలహాబాద్ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా.. ముఘల్ సరయ్ రైల్వే జంక్షన్ పేరును పండిట్ దీల్ దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మార్చడం తెలిసిందే.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మార్చడంపై చరిత్రకారులు, స్థానికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 2018లో ఫైజాబాద్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య జిల్లాగా పేరు మార్చింది. ప్రస్తుతం అక్కడి రైల్వేస్టేషన్ బోర్డులు కూడా మారిపోతున్నాయి. ఇవన్నీ చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపును చెరిపేస్తున్నాయని స్థానికుల్లో ఎక్కువమంది పెదవి విరుస్తున్నారు. పైగా ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలోనే ‘అయోధ్య’ పేరుతో మరో రైల్వేస్టేషన్ ఉండటంతో ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడుతోందని చెబుతున్నారు.
అయితే మరో వర్గం ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు. అయోధ్య అన్న పేరుతో ఇది రాముడి నగరమన్న విశేష గుర్తింపు వస్తుందని పేర్కొంటున్నారు. హిందువుల మనోభావాల పేరిట రాజకీయ లబ్ధి పొందాలన్నదే భాజపా ప్రభుత్వ వ్యూహమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మాత్రం.. గొప్ప చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు.
Also Read: Delhi Air Pollution Today: ఢిల్లీలో మరింతగా పెరిగిన వాయు కాలుష్యం.. ప్రమాదకర స్థాయికి సూచీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook