Bengaluru Express: రైలుపై విరిగిపడిన కొండచరియలు...పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌..

బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడి పట్టాలపై పడటం వల్ల ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 01:09 PM IST
Bengaluru Express: రైలుపై విరిగిపడిన కొండచరియలు...పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌..

Kannur-Bengaluru Express: తమిళనాడు(Tamilnadu)ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో.. బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా(Dharmapuri District)లో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

గురువారం సాయంత్రం 6 గంటలకు కేరళ నుంచి బయలుదేరిన కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌  రైలు(Kannur-Bengaluru Express).. పట్టాలపై బండరాళ్లు పడటం వల్ల శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు తొప్పూరి- శివాడి మధ్య పట్టాలు తప్పింది.  ఐదు బోగీలు(Coaches) పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమమని, ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు(Railway Officials) తెలిపారు. ప్రమాద సమయంలో రైలులో 2348 మంది ఉన్నారు. 

Also Read: Nallamala Forest: గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను బెంగళూరు(Bengaluru) తరలించేందుకు తొప్పూరిలో 15 బస్సులు ఏర్పాటు చేశారు.  ఘటనా స్థలం వద్ద మరో ఐదు బస్సులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు నీరు, ఫలహారాన్ని అందించినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News