Highway damaged in Nellore: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి కోవూరు సమీపంలోని దామరమడుగు వద్ద 16వ నంబర్ చెన్నై-కోల్‌కతా (Chennai Kolkata highway) హైవే కొట్టుకుపోయింది. నెల్లూరు-విజయవాడ రహదారి కూడా కోతకు గురైంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 5కి.మీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నిలిచిపోయిన వాహనాలను అధికారులు వేరే మార్గాల్లో దారిమళ్లిస్తున్నారు. తిరుపతి (Tirupati) నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను తొట్టంబేడు చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు. అటువైపు వెళ్లే వాహనాలను కడప, పామూరు, దర్శి మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు నుంచి నెల్లూరుకు (Nellore) రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోవూరు సమీపంలో దెబ్బతిన్న జాతీయ రహదారికి మరమ్మతులు చేపడుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఒక మార్గంలోనే వాహనాలకు అనుమతినిస్తున్నామని తెలిపారు. రహదారి కల్వర్టును నిర్మించాక రెండో వైపు వాహనాలకు అనుమతిస్తామని చెప్పారు. సంగం మండలం కోలగట్ల వద్ద ముంబై హైవేపై వరద నీరు (Floods in AP) తగ్గడంతో నెల్లూరు నుంచి కడప వెళ్లే వాహనాలను అధికారులు క్లియర్ చేస్తున్నారు.
Also Read:రాయలసీమ జిల్లాల్లో కుదిపేసిన భారీ వర్షాలు, 24కు చేరుకున్న మరణాలు
వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains in AP) కురుస్తున్న సంగతి తెలిసిందే. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. చాలా చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. రహదారులు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 మంది మృతి చెందారు. మరో 17 మంది వరదల్లో గల్లంతయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ఉధృతంగా పెన్నా నది... వరదతో కోతకు గురైన హైవే... 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్...
కోవూరు సమీపంలో కొట్టుకుపోయిన 16వ నంబర్ జాతీయ రహదారి
పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కోతకు గురైన హైవే
హైవేపై 5కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు