MSRTC Employees Strike: ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించిన మహారాష్ట్ర ఆర్టీసీ

MSRTC Employees Strike: నెల రోజులుగా సమ్మెలో పాల్గొన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన చేసింది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్‌ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 02:05 PM IST
MSRTC Employees Strike: ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించిన మహారాష్ట్ర ఆర్టీసీ

MSRTC Employees Strike: గత నెల రోజులుగా మహారాష్ట్రలో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్టీసీ)ను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎంఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను ఎంఎస్‌ఆర్టీసీ సస్పెండ్‌ చేసింది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్‌ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా.. 1,496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. 

ఇటీవల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు వెంటనే విధుల్లోకి చేరాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మొత్తం 92,266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 18 వేల మందికిపైగా శనివారం విధుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 250 డిపోలు ఉండగా.. 50 డిపోల్లో బస్‌ సేవలు పునరుద్ధరించామని, త్వరలో పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. 

Also Read: తమిళనాడుకు మరో ముప్పు, బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక

ALso Read: Gautam Gambhir: గౌతమ్​ గంభీర్​కు మరోసారి బెదిరింపు మెయిల్- వారంలో ఇది మూడోసారి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News