తమిళనాడుకు మరో ముప్పు, బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక

తమిళనాడుకు భారీ వర్షాలు, వరద కష్టాలు తీరేట్ట కన్పించడం లేదు. వరద ముప్పులో చిక్కుకున్న తమిళనాడుకు మరో  ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2021, 02:18 PM IST
తమిళనాడుకు మరో ముప్పు, బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక

తమిళనాడుకు భారీ వర్షాలు, వరద కష్టాలు తీరేట్ట కన్పించడం లేదు. వరద ముప్పులో చిక్కుకున్న తమిళనాడుకు మరో  ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. 

బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా గత 15 రోజులుగా తమిళనాడు భారీ వర్షాలతో అల్లకల్లోలమవుతోంది. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కరుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తమిళనాడుకు మరో తుపాను పొంచి ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.

తమిళనాడులోని(Tamilnadu) కోస్తా ప్రాంత జిల్లాలకు రానున్న 48 గంటల్లో తుపాను పొంచి ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే తీవ్ర వర్షాలతో విలవిల్లాడుతున్న తమిళనాడు ఈ నెల 29వ తేదీన అంటే రేపు మరో తుపాను ఎదుర్కోనుందని ఐఎండీ తెలిపింది. రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడి తుపానుగా (Cyclone)మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశాలున్నాయ. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు దక్షిణ ఏపీలోని తీరప్రాంతంలో పరిస్థితి మరో 2-3 రోజుల్లో ఉధృతంగా మారనుంది. తీరప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. కొన్నిచోట్లైతే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీయవచ్చు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD)హెచ్చరించింది. 

Also read: బిగ్‌బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయింది యాంకర్ రవినా..పెరుగుతున్న ట్రోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News