Digital payment: గడిచిన 12 నెలల్లో డిజిటల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆర్టీజీఎస్, సహా ఇతర డిజిటల్ పేమెంట్ లావాదేవీల సంఖ్య, విలువ.. గత ఐదేళ్లలో సాధించిన వృద్ధిని మించి (Digital payments Growth in India) పెరిగింది.
ఈ విషయాన్ని ఆర్బీఐ (RBI) పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వాసుదేవన్ వెల్లడించారు. పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్‌లో (PCI Digital Money) ప్రసంగించిన ఆయన ఈ వివరాలు పేర్కొన్నారు.
గత 12 నెలల్లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 53 శాతం పెరగ్గా.. విలువ 28 శాతం పెరిగినట్లు తెలిసింది. ఇక గత ఐదేళ్లలో చూస్తే.. డిజిటల్ లావాదేవీల సంఖ్య 42 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం లావాదేవీలు ఇలా..
దేశంలో ప్రస్తుతం రోజువారీగా సగటున 21.79 కోట్ల లావాదేవీలు (Daily Digital payments in India) జరుగుతున్నాయని వాసుదేవన్ తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గత ఏడాది డిసెంబర్లో ఆర్టీజీఎస్ సేవలను 24x7 పని చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. దీనితోపాటు అనేక సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు.
పేమెంట్ వ్యవస్థలైన ఎన్ఏసీహెచ్, భారతీ బిల్ పేమెంట్ వంటివి వారాంతాల్లో కూడా పేమెంట్ సెటిల్మెంట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు వాసుదేవన్. వారంలో సెటిల్మెంట్ల సంఖ్యను 200కు పెంచినట్లు వివరించారు. దీని ద్వారా క్రెడిట్, సెటిల్మెంట్, రిస్క్ స్థాయిలో భారీగా తగ్గినట్లు స్పష్టం చేశారు.
పేమెంట్ వ్యవస్థ భారీ వృద్ధి..
దేశంలో పేమెంట్ వ్యవస్థ భారీ వృద్ధి సాధించినట్లు వాసుదేవన్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో డిజిటల్ లావాదేవీలు పెరగినట్లు చెప్పారు. యూపీఐ లావాదేవీల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 421 కోట్లకు పెరిగినట్లు గుర్తు చేశారు. నవంబర్‌లో ఈ సంఖ్య 418 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు.
యూపీఐ పేమెంట్స్ గత ఏడాదితో పోలిస్తే.. అక్టోబర్‌లో 100 శాతం పెరిగినట్లు తెలిసింది. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.7.7 లక్షల కోట్లకు సమానం అని వెల్లడైంది.
డిజిటల్ లావాదేవీలపై పార్లమెంట్లో ప్రకటన..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ (ఐడీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిజిటల్ లావాదేవీలపై ప్రకటన చేశారు.
2018-19లో 3134 కోట్ల లావాదేవీలు (సంఖ్య పరంగా) జరిగినట్లు వెల్లడించారు. 2019-20లో ఈ సంఖ్య 4572 కోట్లుగా నమోదైనట్లు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ మధ్య వరకు డిజిటల్ లావాదేవీల సంఖ్య 4683 కోట్లకు చేరినట్లు వివరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 5554 కోట్లకు పెరిగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
Also read: Gold Rate: అత్యంత స్వల్పంగా పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి
Also read: OLA Electric Car: ఓలా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook